మోడీ స్కీమ్.. ఎలాంటి గ్యారెంటీ లేకుండానే 10 లక్షలు రుణం..?

praveen
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంఅన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనం చేకూరే విధంగా ఎన్నో రకాల పథకాలను ప్రవేశ పెడుతుంది అన్న విషయం తెలిసిందే.  ఇక ప్రస్తుతం కరోనా  వైరస్ సంక్షోభం సమయంలో కూడా సంక్షేమం దిశగా అడుగులు వేస్తున్న కేంద్ర ప్రభుత్వం ఎంతో మంది ఆర్థికంగా చితికిపోయిన వారికి అండగా నిలబడేందుకు వివిధ రకాల పథకాలను అందుబాటులోకి తీసుకొచ్చింది.  అయితే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఎన్నో రకాల పథకాలలో రుణ గ్రహీతలకు ఊరట కలిగించే స్కిమ్స్  కూడా ఉన్నాయి అని చెప్పాలి. సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేయాలనే ఆలోచన ఉన్న వారికి ఆర్థికంగా చేయూత అందించాలనే లక్ష్యంతో... కేంద్ర ప్రభుత్వం ముద్ర యోజన పేరుతో ఒక స్కీమ్ను ప్రస్తుతం అందిస్తుంది.

 అయితే ప్రధానమంత్రి ముద్ర యోజన స్కీమ్ ద్వారా అర్హత కలిగిన వారు పది లక్షల వరకు రుణం తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఇలా 10 లక్షల రుణం పొందేందుకు ఎలాంటి గ్యారెంటీ కూడా అవసరం లేదు అని చెప్పాలి. కేవలం పురుషులు మాత్రమే కాదు మహిళలు కూడా ఈ 10 లక్షల రుణం పొందేందుకు అవకాశం ఉంటుంది. అయితే ప్రధానమంత్రి ముద్ర యోజన స్కీమ్ ద్వారా మూడు రకాలుగా రుణం పొందేందుకు అవకాశం ఉంటుంది. రూ.50,000 వరకు రుణం తీసుకోవాలంటే శిశు లోన్ కేటగిరి కిందకు వస్తారు. రూ.50 వేల నుంచి రూ.5 లక్షల వరకు రుణం అయితే కిశోర్ కేటగిరిలో ఉంటారు. ఇక రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు రుణం పొందాలని భావిస్తే తరుణ్ కేటగిరి కింద లోన్ పొందొచ్చు.

 అయితే ఎంతో సులభంగా ఈ ప్రధానమంత్రి ముద్ర లోన్ పొందేందుకు అవకాశం ఉంటుంది. దీని కోసం మీరు మీ దగ్గరలోని బ్యాంక్ లేదా ఎం బి ఎఫ్ సి, ఎం ఎస్ ఐ  లాంటి సంస్థలకు వెళ్లి లోన్ తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. అంతేకాకుండా.. https://www.udyamimitra.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో కూడా లోన్ కోసం అప్లై చేసుకునేందుకు వెసులుబాటు ఉంది. ఏదైనా సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకునే వారికి ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ ముద్ర లోన్  ఒక అద్భుతమైన అవకాశం అని చెప్పాలి. ప్రస్తుతం ప్రధానమంత్రి ముద్ర లోన్ ద్వారా ఎంతోమంది ప్రయోజనం పొందుతున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: