తిరుపతి ఎఫెక్ట్: సోముకు పదవీ గండం..!
దీంతో ఎటూ తేల్చకుండా కేంద్ర బీజేపీ చీఫ్.. నడ్డా.. ఈ టికెట్ ఎవరికి ఇవ్వాలి, ఏ పార్టీకి ఇక్కడ బలం ఎంత ఉంది ? గత చరిత్ర ఏమిటి ? అనే కీలక అంశాలను అధ్యయనం చేసిన తర్వాతే నిర్ణయించాలని భావించారు. దీనికి సంబందించి కమిటీ వేయాలని అనుకున్నారు. ఇంకా కమిటీనే వేయలేదు. దీంతో ఇటు జనసేన, అటు బీజేపీలోనూ ఉత్కంఠ నెలకొంది. కానీ, ఈ ఉత్కంఠ ఏమీ లేదన్నట్టుగా.. బీజేపీ చీఫ్ సోము వీర్రాజు మాత్రం .. తిరుపతిలో బీజేపీ అభ్యర్థిని గెలిపించాలంటూ.. అక్కడ పార్టీ నిర్వహించిన సభలోనే కాకుండా.. కర్నూలులో నిర్వహించిన సమావేశంలోనూ పిలుపునిచ్చారు. ఇది జనసేనలో కాక రేపింది.
ఈ టికెట్‌పై ఇంకా ఏమీతేలకుండా.. మీరు ఎలా ప్రకటిస్తారంటూ.. జనసేన తిరుపతి నేతలు.. బాహాటంగానే సోమును టార్గెట్ చేస్తున్నారు. అదే సమయంలో జనసేనాని పవన్‌కు కూడా ఇక్కడి సోము దూకుడుపై ఫిర్యాదులు అందాయి. దీంతో ఆయన నేరుగా బీజేపీ చీఫ్ దృష్టికి తీసుకువెళ్లి.. విషయం తేల్చుకోవాలని నిర్ణయించారు. అంతేకాదు, తేడా వస్తే బయటకు వచ్చి సొంతగా జనసేన అభ్యర్థిని రంగంలోకి దింపాలని కూడా ప్రాథమికంగా నిర్ణయించినట్టు జనసేన వర్గాల వాదన. మరోవైపు కేంద్రంలోని బీజేపీ నేతలు పవన్‌ను వదిలి పెట్టే ప్రసక్తి లేదు. ఎందుకంటే.. కేవలం ఒక్క సీటు కోసం చూసుకుంటే.. 2024లో అధికారంలోకి రావాలనుకున్న వారి లక్ష్యానికి గండి పడే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలో అవసరమైతే.. సోమును పక్కన పెట్టేందుకు కూడా వెనుకాడబోరని అంటున్నారు. పైగా.. సోముపై స్థానిక నేతలు కూడా ఫిర్యాదులు చేస్తున్నారు. కీలకమైన నాయకులను ఆయన కట్టడి చేస్తున్నారని.. ఎంతో మంది మీడియాలో గట్టిగా మాట్లాడి బీజేపీ వాయిస్‌ను వినిపించేవారని. అయితే.. తన వర్గానికి చెందిన వారు కారనే ఉద్దేశంతో వారందరినీ సస్పెండ్ చేశారని చాలా మంది బీజేపీ నేతలు ఇప్పటికే ఫిర్యాదులు పంపారు. ఇక, మాజీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ కూడా సోముపై గుర్రుగానే ఉన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో సోమును సాగనంపడం ఖాయమని, అందరినీ కలుపుకొని పోయే వారికి అవకాశం ఇస్తారని ప్రచారం జరుగుతోంది. మరి సోము ఈ వ్యతిరేకతను లైన్‌లోకి తెస్తారా? పదవిని వదులుకుంటారా చూడాలి.. అంటున్నారు సీనియర్లు.