కన్నా రూట్ మారుస్తారా?
కానీ హఠాత్తుగా కన్నా రూట్ మారింది. ఆయన యూ టర్న్ తీసుకుని బీజేపీలోకి వచ్చారు. ఆ వెంటే ఏపీ అధ్యక్షుడు కూడా అయ్యారు. ఇక ఏపీ బీజేపీ అధ్యక్షుడుగా అప్పుడు అధికారంలో చంద్రబాబుపై ఏ విధంగా పోరాటం చేశారో తెలిసిందే. 2019 ఎన్నికల్లో జగన్ అధికారంలోకి రావడంతో కన్నా వర్షన్ మారింది. కన్నా, జగన్ ప్రభుత్వంపై విమర్శల బాణాలు ఎక్కిపెట్టారు.
ప్రతిపక్ష టీడీపీతో పోటీగా జగన్ ప్రభుత్వంపై పోరాటం చేశారు. ఒకానొక దశలో కన్నా, వైసీపీ నేతల మధ్య చిన్నపాటి యుద్ధమే జరిగింది. అయితే ఏమైందో తెలియదు గానీ, ఒక్కసారిగా బీజేపీ అధిష్టానం రూట్ మార్చి కన్నాని సైడ్ చేసి, సోము వీర్రాజుకు ఏపీ పగ్గాలు అప్పగించారు. ఇక సోము వీర్రాజు వర్షన్ ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన అధికార పక్షంపై చేసిన పోరాటం తక్కువ, ప్రతిపక్షంపై చేసిన విమర్శలు ఎక్కువ.
సోముకు పగ్గాలు వచ్చాక కన్నా లక్ష్మీనారాయణ పూర్తిగా సైలెంట్ అయిపోయారు. అసలు మీడియా సమావేశాల్లో సైతం కనిపించడం లేదు. పైగా కన్నా అధ్యక్షుడు అయ్యాక, కన్నాకు అనుకూలంగా ఉన్న కొందరు బీజేపీ నేతలని సస్పెండ్ చేశారు. కన్నాకు కుడిభుజం లాంటి ఓవీ రమణను ఎలాంటి నోటీసు ఇవ్వకుండా బహిష్కరించారు. కన్నాకు కుడిభుజం లాంటి ఓవీ రమణను ఎలాంటి నోటీసు ఇవ్వకుండా బహిష్కరించారు. ఈ పరిణామాల నేపథ్యంలో కన్నా సైలెంట్ అయ్యారు. మరి సైలెంట్‌గా ఉంటూనే కన్నా రూట్ మారుస్తారా లేక బీజేపీలోనే కొనసాగుతారనేది చెప్పలేని పరిస్తితి.