పెళ్ళైన అక్క పై కన్నేసిన తమ్ముడు..అర్థరాత్రి దారుణం..
వివరాల్లోకి వెళితే.. ఈ అమానుష ఘటన మహారాష్ట్రలోని పూణే లో వెలుగు చూసింది.. పింప్రి చించ్వాడ్ పరిధిలోని భోసారి ఏరియాకి చెందిన మహిళ కి వివాహమైంది. భర్తతో మనస్పర్థల కారణంగా ఆమె పుట్టింట్లోనే ఉంటోంది. కష్టాల్లో ఉన్న అక్కకి ధైర్యంగా తోడునిలబడాల్సిన తమ్ముడు బుద్ధి వక్రమార్గం పట్టింది. డ్రగ్స్, మద్యానికి బానిసై సొంత అక్కపైనే కన్నేశాడు. నాలుగు రోజుల కిందట అర్ధరాత్రి వేళ మత్తులో ఊగుతూ ఇంటికి వచ్చిన తమ్ముడు అక్కపై నీచానికి ఒడిగట్టాడు. అతని అలికిడికి మెళుకువ వచ్చిన అక్క మాత్రం అతని ఆగడాలకు అడ్డుకట్ట వేయడానికి ప్రయత్నించింది..
ఆమెను ఎలాగైనా కూడా అనుభవించాలనే కోరికతో ఉన్న తమ్ముడు పక్కనే ఉన్న చెక్క మొద్దు తో తీసుకుని ఆమెను దారుణంగా కొట్టాడు. అడ్డొచ్చిన తల్లిని కూడా చావబాదాడు. మరుసటి రోజు భాధితురాలు కుటుంబ సభ్యులతో కలసి పోలీసులను ఆశ్రయించింది. సీరియస్‌గా పరిగణించిన పోలీసులు నిందితుడిపై 356, 504, 323, 324 తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. ఈ ఘటనపై పోలీసు అధికారి మాట్లాడుతూ గత సెప్టెంబర్ నుంచి నిందితుడు ఆమెతో అలానే ప్రవర్తిస్తున్నాడు.గతంలో గొడవలు జరిగాయని పోలీస్ స్టేషన్‌కి వచ్చారని.. అయితే ఫిర్యాదు చేయలేదన్నారు. ఇకపోతే ఇప్పుడు జరిగిన ఘటన కారణంగా అతన్ని వదిలిపెట్ట వద్దని వేదికున్నట్లు పోలీసు అధికారి వెల్లడించారు..