అఖండ 2: పోయి పోయి మళ్ళీ ఆ కాంట్రవర్సీ డేట్ నే ఎందుకు చూస్ చేసుకున్నారా సామీ..?

Thota Jaya Madhuri
టాలీవుడ్‌లో నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే ఎప్పుడూ పవర్‌ఫుల్ మాస్ ఎంటర్టైనర్‌కే అడ్రస్‌. అలాంటి జోడీ నుంచి వచ్చిన 'అఖండ' ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో అందరికీ తెలిసిందే. అదే జోష్‌తో నిర్మించిన సీక్వెల్ ‘అఖండ 2: తాండవం’ మాత్రం రిలీజ్‌కు గంటలు మాత్రమే మిగిలి ఉండగా వాయిదా పడటం, అభిమానుల్లో భారీ నిరాశను మాత్రమే కాదు… ఆగ్రహాన్ని కూడా తెప్పించింది.డిసెంబర్ 5న ఉదయం నుంచే దేశవ్యాప్తంగా అభిమానులు ఉత్సాహంగా వేచి ఉన్నారు. కానీ, రిలీజ్‌కు కేవలం కొన్ని గంటల ముందు ఫైనాన్షియల్ వివాదాల కారణంగా మద్రాస్ హైకోర్టు సినిమా విడుదలపై తాత్కాలిక నిషేధం విధించింది.


ఈ నిర్ణయం రావడంతో సినిమా మేకర్స్, డిస్ట్రిబ్యూటర్లు, అభిమానులు – అందరూ షాక్‌కు గురయ్యారు. ఇప్పటికే ప్రీమియర్ షోలకు పాసులు బుక్ చేసి ఉత్సాహంగా ఉన్న ఫ్యాన్స్ నిరాశతో సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ గందరగోళం ఇంకా సద్దుమణగక ముందే, బుక్ మై షోలో అఖండ 2026 ల్) రిలీజ్ అవుతుంది అన్న డిస్‌ప్లే కనిపించింది.అది చూసిన నెటిజన్లు షాక్ అయ్యి ఆ స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దీని పై ఫ్యాన్స్ ఘాటుగా స్పందిస్తున్నారు. "ఇది తాత్కాలిక వాయిదా కాదుగా… ఏకంగా సంవత్సరాన్నే మార్చేశారు!". "కోర్టు నిషేధం పడగానే ఇలా చేస్తారా?" "మేకర్స్‌ను నమ్మాల్సా లేక బుక్ మై షోను నమ్మాలా?" ఇలా నెటిజన్లు వ్యంగ్యంగా పోస్టులు పెడుతూ కొత్త రచ్చ మొదలుపెట్టారు.


ఇక సోషల్ మీడియాలో మరో వార్త వైరల్ అవుతోంది.సినిమా‌ను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలనుకుంటున్నారు అని టాక్.అదే  నిజమైతే… కాంట్రవర్సీకి కొత్త తలుపు తెరిచినట్టే! ఎందుకంటే సంక్రాంతి 2026 కి ఇప్పటికే భారీ సినిమాలు లైన్లో ఉన్నాయి. జనవరి 9 – ప్రభాస్ ‘రాజాసాబ్’..చిరంజీవి – అనిల్ రావిపూడి ‘మన శంకర వరప్రసాద్ గారు’. ఈ రెండు సినిమాలు పక్కా డేట్లతో రెడీగా ఉన్నాయి. అలాంటి సీజన్‌లో మాస్ సినిమాల మాస్టర్ అయిన బాలయ్య సినిమా కూడా అదే డేట్‌కి వస్తే… బాక్సాఫీస్‌పై పవర్‌ఫుల్ క్లాష్ గ్యారంటీ!


ఇండస్ట్రీ వర్గాల మాటల్లో చెప్పాలంటే..“ఇది రచ్చ కాదు రంబోలే… కాంట్రవర్సీ ఓపెన్‌గా రాసుకుని వచ్చినట్టే!”..అయితే ఫ్యాన్స్ మాత్రం ఈ నిర్ణయంతో అస్సలు హ్యాపీగా లేరు.
వాళ్ల రియాక్షన్లు చూస్తే.. “ఇప్పటికే కోర్టు ఇష్యూలతో సినిమాకి టెన్షన్ పడుతోంది…” “ఈ సమయంలో కొత్త క్లాష్ తలకెత్తుకోవడన్నా… అవసరమా బ్రదర్?”..“సేఫ్ డేట్ పెట్టుకోండి… సినిమా బజ్ అనవసరంగా తగ్గిపోకుండా చూడండి”అంటూ మేకర్స్‌పై సీరియస్‌గా స్పందిస్తున్నారు. మరో పక్క డిసెంబర్ 12 లేదా డిసెంబర్ 25? కూడా అఖండ 2 ని రిలీజ్ చేసే విధంగా ఆలోచిస్తున్నారట. ఇప్పుడు బాలయ్య–బోయపాటి కాంబినేషన్ నుంచి ఇలాంటి భారీ హైప్ ఉన్న సినిమా ఏ తేదీకి విడుదలవుతుందో…టాలీవుడ్ అంతా ఉత్కంఠతో ఎదురు చూస్తోంది!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: