ముద్రగడ డిసైడ్ అయిపోయారు గా ? నెక్స్ట్ ఏంటి ?
ఇటీవల ఢిల్లీలో పెద్ద ఎత్తున రైతులు చేపడుతున్న ఆందోళన కార్యక్రమాలకు ముద్రగడ మద్దతు పలికారు. అలాగే ప్రధాని నరేంద్ర మోడీకి సైతం ముద్రగడ రాశారు. ఇదిలా ఉంటే ముద్రగడ ను బిజెపిలో చేర్చుకునేందుకు ఆ పార్టీ గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. తిరుపతి ఉప ఎన్నికలకు ముందే ఆయనను పార్టీలో చేర్చుకుంటే బలమైన కాపు ఓటు బ్యాంకు తమ సొంతం అవుతుందని అంచనా వేస్తోంది. అందుకే తిరుపతిలో పోటీకి దిగి ముద్రగడతో ఎన్నికల ప్రచారం చేయించి భారీగా లబ్ధి పొందాలని బిజెపి చూస్తోంది. ఆయనతో పాటు జనసేన పార్టీ అండదండలు కూడా ఉండటంతో, సులువుగా తిరుపతి స్థానంలో గెలవచ్చు అనేది బిజెపి ప్లాన్ కనిపిస్తోంది.
ఆయన పార్టీలో చేరితే, కీలకమైన పదవి ఇచ్చి గౌరవిస్తామని, ఆర్థిక అండదండలు అందిస్తామనే విధంగా బిజెపి సంకేతాలు పంపిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే బిజెపిలో చేరే విషయమై ఇంకా ముద్రగడ ఏ నిర్ణయం తీసుకోలేదని సమాచారం. ముద్రగడ కనుక బిజెపి లోకి వస్తే, గోదావరి జిల్లాలతో పాటు కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న అన్ని ప్రాంతాల్లోనూ బీజేపీ కి బలం పెరుగుతుందనే అభిప్రాయాలు ఆ పార్టీలో ఉండడంతోనే ముద్రగడ కోసం గట్టిగానే ప్రయత్నాలు బీజేపీ చేస్తోందట.