వామ్మో వాళ్లే బాబు ఆశలకు గండికొట్టేది ? సీఎం కల ఇక కల్లే ?

ప్రస్తుతం టీడీపీ అధినేత చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్నారు. తన రాజకీయ విరోధి అయిన జగన్ సీఎం గా ఉండడం మొదటి నుంచి బాబుకు ఏమాత్రం ఇష్టం లేదు. అసలు ఆయన సీఎం అనే విషయాన్ని బాబు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికీ, ఎప్పటికీ సీఎం తానే అన్నట్లుగా బాబు వ్యవహరిస్తున్నారు. ఇక ప్రజలలోనూ వైసీపీ ప్రభుత్వం క్రెడిట్ ను దెబ్బతీసి టీడీపీకి మరింత బలం చేకూర్చే విషయంపైనా బాబు దృష్టిసారించారు. అందుకే ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు అన్నితిపైనా పూర్తిగా నిఘా పెట్టి , అందులోని లోపాలను జనాల్లోకి తీసుకువెళ్లి ఆ క్రెడిట్ పార్టీకి దక్కకుండా చేసేందుకు ఆ పార్టీ నాయకులు చేయని ప్రయత్నం అంటూ లేదు. అలాగే ఏపీలో కొన్ని వర్గాల ప్రజలను వేధింపులకు గురిచేస్తున్నారు అని, పదేపదే అవకాశం దొరికినప్పుడల్లా రోడ్లపైకి వచ్చి ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 





ఈ విధంగా టిడిపికి కాస్తో కూస్తో మైలేజ్ పెరిగినట్టుగా కనిపిస్తోంది. చంద్రబాబు హైదరాబాద్ లోని ఇంట్లో ఉన్నా, అమరావతిలో ఉన్నా, ఆన్లైన్ ద్వారా పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉంటూ వస్తున్నారు. జమిలి ఎన్నికలు వస్తాయని త్వరలోనే జగన్ మాజీ సీఎం అయిపోతాడు అంటూ పదే పదే ప్రచారం చేస్తున్నారు. అయితే గతంతో పోలిస్తే వైసిపి కి జనాల్లో ఆదరణ పెరిగిందని, గతంలో 50 శాతం ఆదరణ ఉంటే, ఇప్పుడు అది 53 శాతానికి పెరిగిందని, టిడిపికి ఉన్న 40 శాతం ఓట్ బ్యాంక్ అలాగే ఉందని , ఈ లెక్కన చూస్తే టీడీపీ కంటే వైసీపీనే కాస్తా పైచేయి సాధించినట్లు గా కనిపిస్తోంది. అలాగే ఏపీలో బీజేపీ బలం పెంచుకుంటోంది. ఆ బలం పెంచుకునే క్రమంలో టిడిపికి ఊహించని దెబ్బ వేస్తోంది. ఎందుకంటే బిజెపి చీల్చి ఓట్లు టిడిపికి ఓటు బ్యాంకు కు గండి కొట్టేవే. ఇలా ఎలా చూసుకున్నా, చంద్రబాబుకు మళ్లీ సీఎం అయ్యే ఛాన్స్ కనిపించడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: