మందు కొట్టేటప్పుడు వీటిని తింటే ఆరోగ్యానికి మంచిదంట..!?

N.ANJI
చాల మందికి మందు తాగే అలవాటు ఉంటుంది. చిన్న పార్టీ చేసుకున్న మందు తాగాల్సిందే. అలా తాగిన కూడా మద్యపానం ఆరోగ్యానికి హానికరం  లివర్ సమస్యలు వస్తాయని బెంగ పెట్టుకుంటున్నారా. ఇక మీకు అలాంటి బెంగ  అవసరం లేదు. ఇక మీరు హ్యాపీగా తాగే యండంటున్నారు పరిశోధకులు. అయితే అలా తాగేటప్పుడు  మాత్రం పచ్చిమిర్చి ముక్కలు నంజుకోండి అంటూ  సలహా ఇస్తున్నారు. ఇలా చేయడం వల్ల కాలేయం కి ఎలాంటి సమస్యలు రావట.

అయితే ఎంతో మందిపై  అధ్యయనాలు  చేసిన శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నారు.ఆఫ్రికన్ ట్రైబల్స్ పై  చేసిన పరిశోధనలో ఈ విషయం బయటపడింది. ఆఫ్రికాలోని ప్రజలు మందు తాగే సమయంలో సైడ్ డిష్‌గా గ్రీన్ చిల్లీస్‌ని వాడుతుంటారు. వీరిని పరీక్షించగా వారికి ఎలాంటి లివర్ సంబంధిత సమస్యలు లేవని పరిశోధన ఫలితాలు చెబుతున్నాయి. అదే పచ్చిమిర్చి తీసుకోకుండా తాగిన  వారిలో మాత్రం కాలేయ సమస్యలు ఎక్కువగా కనిపించాయి.

ఇక విశాఖ ఆంధ్రా వర్సిటీ, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, లు సంయుక్తంగా చేసిన పరిశోధనల్లో మన దేశీయ పచ్చిమిర్చిలో కూడా ఎన్నో రసాయనాలు ఉన్నాయని తేలింది. మిర్చిలో ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అవి లివర్ పాడవకుండా చేస్తాయి. దీంతో లివర్ కి ఎలాంటి  సమస్య రాదు. కాబట్టి.. తాగే సమయంలో కాసిన్ని పచ్చిమిర్చి ముక్కలు నంజుకోండి  అంటూ సలహా ఇస్తున్నారు.

అయితే ఇదే అదనుగా తీసుకుని  ఇక మా ఆరోగ్యానికి  ప్రమాదం  లేదంటూ సీసాల కి  సీసాలు మందు కేజీల కొద్దీ పచ్చిమిర్చి తినేయవద్దు అంటూ హెచ్చరిస్తున్నారు . ఇది కేవలం అప్పుడప్పుడు మోతాదు మించి తాగకుండా ఉన్నప్పుడు మాత్రమే చేయాలనీ చెబుతున్నారు. ఆ రెండు మోతాదుకు మించి వాడితే ప్రమాదం తప్పదంటున్నారు…కాబట్టి ఎప్పుడైనా తాగవలిసి వచ్చినప్పుడు మాత్రమే ఈ చిట్కా వాడుకోవాలి.మందు కొట్టేటప్పుడు వీటిని తింటే ఆరోగ్యానికి మంచిదంట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: