మాన్సాస్ ట్రస్ట్ లో మరో వివాదం... కాలేజ్ గేటుకు తాళం...!
కి చైర్ పర్సన్‌గా దివంగత ఆనంద గజపతిరాజు కుమార్తె సంచయిత గజపతిరాజు బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి అశోక్ గజపతిరాజు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. తనను గద్దె దింపి సంచయిత మానస ట్రస్ట్ అధికార పగ్గాలు చేపట్టడంతో సహించలేని అశోక్ గజపతిరాజు అప్పటినుండి విమర్శల యుద్ధం మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. ఆయన వెదజల్లుతున్న విమర్శలకు ఎప్పటికప్పుడు సంచయిత కౌంటర్లు ఇస్తూనే ఉంది. ఈ వివాదం ఇప్పటికీ అలా కొనసాగుతూనే ఉంది. వారసత్వ రణరంగంలో వివాదాలు చెలరేగుతూనే ఉన్నాయి.
ఇదిలా ఉండగా ఇంకోవైపు.... మరోసారి విజయనగరం గజపతిరాజుల కుటుంబ తగాదాల పోరు తెరపైకి వచ్చింది.మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ సంచయిత వైఖరి పై మండిపడుతూ ఆందోళనకు దిగారు స్థానికులు. ఒకవైపు సంచయిత కుటుంబ సభ్యులతో వివాదాలు ఎదుర్కొంటుంటే మరోవైపు సంచయిత వైఖరి కారణంగా స్థానికులు ఆమెపై ఆరోపణలు చేస్తున్నారు.తాజాగా మాన్సాస్ ట్రస్ట్ మరో వివాదాస్పద నిర్ణయం తీసుకొంది. దాంతో అక్కడి స్థానికులు ఇదేం న్యాయం అంటూ నిరసనకు దిగారు. ఇంతకీ విషయం ఏంటంటే.....ఎంఆర్ కాలేజీ గ్రౌండ్ అయోధ్య మైదానం గేటుకు తాళాలు వేశారు. కాలేజీ ప్రిన్సిపాల్ పేరుతో ఓ నోటీసును గేటుకు అంటించారు. అందులో ఏముందంటే ..!! విద్యార్థులు కాలేజీ సిబ్బంది తప్ప మరెవరు లోపలికి ప్రవేశించడానికి అనుమతి లేదని లిఖించి ఉంది.
అయితే ఈ నిర్ణయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు అక్కడి స్థానికులు. ఎన్నో ఏళ్లుగా కాలేజీ మైదానంలో ఎంతో ఆహ్లాదంగా వాకింగ్ చేస్తున్నామని.. ఇప్పుడు అనాలోచితంగా.. అకారణంగా తాళాలు వేయడం ఏంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. మాన్సాస్ ట్రస్ట్ తీరుపై స్థానికులు విమర్శిస్తూ ఇది సబబు కాదని మండిపడ్డారు. తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ కాలేజీ గేటు ముందు స్థానికులు నిరసన దిగారు. ఏదేమైనా ఎంఆర్ కాలేజీ గ్రౌండ్ అయోధ్య మైదానం గేటు తలుపులు తెలుసుకోవాల్సిందే అంటూ బైఠాయించారు. ఇప్పుడు ఈ నిరసనకు.. మాన్సాస్ ట్రస్ట్ ఎంఆర్ కాలేజీ స్పందించాల్సి ఉంది.
విజయనగరంలో ఎంతో ప్రసిద్ధి చెందిన ఎంఆర్ కాలేజీ ని ప్రైవేటు పరం చేస్తారని ప్రకటించడంతో అసలు సమస్య మొదలైంది. మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ సంచయిత తాజాగా ఎంఆర్ కాలేజీని అన్ ఎయిడెడ్ కాలేజీగా మార్చాలంటూ ప్రభుత్వానికి లేఖ రాయడంతో... విషయం తెలుసుకున్న స్థానికులు ఆమె వ్యవహార శైలిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ... తీవ్ర విమర్శలు బాణాలు ఎక్కుపెడుతున్నారు. ఈ కాలేజీని ప్రైవేటు పరం చేయడం న్యాయం కాదని వ్యతిరేకిస్తున్నారు. మరి ఈ వ్యవహారం పై... సంచయిత ఎలా స్పందిస్తారో అన్న విషయం ఆసక్తికరంగా మారింది.