ఇలా చేస్తే శబరిమల ప్రసాదం ఇంటికే.. త్వరపడండి అప్పటి వరకే ఛాన్స్..?

praveen
ప్రస్తుతం కరోనా  వైరస్ కారణంగా భక్తులకు దేవుడికి మధ్య ఎంతో  దూరం పెరిగిపోయింది అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం కనీసం దేవుడు చెంతకు వెళ్ళి తమ బాధలు చెప్పుకునేందుకు కూడా అవకాశం లేని పరిస్థితి ఏర్పడుతుంది. కరోనా  వైరస్ కారణంగా ఆయా ఆలయ నిర్వాహకులు కఠిన నిబంధనలు అమలు చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం దేవుడికి పూజలు చేయాలి అన్న కూడా నిబంధనల మధ్య చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది అన్న విషయం తెలిసిందే.

 అయితే ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా దేవుడికి భక్తులకు మధ్య దూరం పెరిగిపోయిన నేపథ్యంలో తపాలాశాఖ ప్రస్తుతం దేవుడికి భక్తులకు మధ్య కీలక పాత్ర పోషిస్తోంది. ముఖ్యంగా దేవుడికి సంబంధించిన పలు రకాల పూజ వస్తువులు ప్రసాదాలు నేరుగా భక్తుల చెంతకు చేర్చడంలో తపాలాశాఖ కీలక పాత్ర వహిస్తుంది అనే విషయం తెలిసిందే. అయితే శబరిమలైలో అయ్యప్ప స్వామి ప్రసాదం ఎంత ప్రఖ్యాతిగాంచింది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎవరైనా శబరిమల వెళ్తున్నారు అంటే ఈ అరవన్న  పాయసం తెప్పించుకుంటారు తప్పకుండా.


 కానీ ఈ ఏడాది మాత్రం శబరిమల ఆలయం లో కొంతమంది స్వాములకు మాత్రమే అనుమతి ఉండడం అంతే కాకుండా కఠిన నిబంధనల మధ్య శబరిమల ఆలయాన్ని తెరవడంతో ప్రస్తుతం ప్రసాదం దొరుకుతుందా లేదా అని భక్తులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలోనే పోస్టల్ శాఖ కీలక నిర్ణయం తీసుకుని భక్తులకు అయ్యప్ప స్వామి ప్రసాదాన్ని పోస్టు ద్వారా గత కొన్ని రోజుల నుంచి డోర్ డెలివరీ చేస్తుంది. దీని కోసం దగ్గరలోని పోస్టాఫీసుకు వెళ్లి స్వామి ప్రసాదం పేరుతో 450 రూపాయలు చెల్లించాలి.. అంతే కాకుండా పూర్తి పేరు పూర్తి అడ్రస్ మొబైల్ నెంబర్ ఇవ్వాలి ఇక రిజిస్టర్ చేసుకున్నవారికి స్వామివారి ప్రసాదం తోపాటు అభిషేక నెయ్యి పసుపు కుంకుమ విభూతి డోర్ డెలివరీ అవుతాయి.  ఈ అవకాశం జనవరి 15 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: