అక్కడ డాక్టర్ లు కుళ్ళు రాజకీయాలకు వైద్యం చేస్తారా..?

P.Nishanth Kumar
రాష్ట్రంలో పార్టీ ల మధ్య పోటీ ఎలా ఉన్నా ప్రజల స్టాటజీ లు చివరి నిమిషం వరకు ఎవరికీ అర్థం కావు.. అందుకు ఉదాహరణగా టీడీపీ నే చెప్పొచ్చు. ఎందుకంటే అధికారంలోఉన్న పార్టీ ఈ రేంజ్ లో ఓడిపోతుందని వైసీపీ కూడా కలలో ఊహించి ఉండదు. అప్ప్పటివరకు టీడీపీ కి గెలుపు గాలులు జోరుగా వీచాయి.. ఎన్నికలు ముగిసాక కూడా చంద్రబాబు టీడీపీ దే విజయం అని విర్రవీగారు కానీ ప్రజల తీర్పు దానికి వ్యతిరేకంగా వచ్చింది.. దాంతో వైసీపీ అధికారంలోకి రప్పించి టీడీపీ ని ప్రతిపక్షంలో కూర్చునేలా చేశారు ప్రజలు..

ఇకపోతే రాష్ట్రంలో  వైసీపీ గెలిచిన అన్ని స్థానాలకు ఒక్కో స్పెషలిటీ ఉంది.. రాజకీయంగా అన్ని నియోజకవర్గాల్లో చాలామంది వివిధ వృత్తులనుంచి రాజకీయనాయకులుగా ఎదిగారు. అయితే కడప జిల్లాల్లో డాక్టర్లు రాజకీయ నాయకులుగా ఎదిగి ప్రజలకు విశేషమైన సేవలు అందిస్తున్నారు. క‌డప జిల్లా నుంచి రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన వారిలో డాక్లర్లు ఎక్కువ‌గా క‌నిపిస్తారు. వీరిలో దివంగ‌త వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి పేరు ఈ రాష్ట్రంలో స‌రికొత్త రికార్డును సృష్టించింది. రూపాయి డాక్టర్‌గా ఆయ‌న ఎంతో పేరు తెచ్చుకున్నారు. అదే స‌మ‌యంలో పేద‌ల పెన్నిధిగా కూడా ఆయ‌న పేరు గ‌డించారు. ఫలితంగా అయన ముఖ్యమంత్రి అయ్యారు..

ఇదే జిల్లాకు చెందిన ఎంవీ మైసూరారెడ్డి కూడా డాక్టర్‌. ఈయ‌న కూడా కాంగ్రెస్‌లోనే చ‌క్రం తిప్పారు. మైదుకూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి వ‌రుస విజ‌యాలు కైవ‌సం చేసుకున్న డీఎల్ ర‌వీంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు క‌సిరెడ్డి మ‌ధుసూద‌న్‌రెడ్డి, ఎంవీ.ర‌మ‌ణారెడ్డి కూడా పూర్వాశ్రమంలో వైద్యులుగా ప్రజ‌ల‌కు సేవ‌లందించారు.ప్రస్తుతం జ‌మ్మల‌మ‌డుగు ఎమ్మెల్యేగా ఉన్న సుధీర్‌రెడ్డి సైతం వైద్యుడే. ఇలా డాక్టర్లు రాజకీయాల్లోకి వచ్చి మంచి రాజకీయాలు చేయడానికి తమదైన వైద్యం చేస్తున్నారు. గత నాలుగు దశాబ్దాలనుంచి ఇక్కడ వారిదే పైచేయి అంటే డాక్టర్ లంటే అక్కడి ప్రజలకు ఎంత ఇష్టమో అర్థమవుతుంది..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: