ట్రంప్ నోట మరో సారి అదే మాట.. నేనే గెలిచా అంటూ..?

praveen
ఇటీవల అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగాయి అన్న విషయం తెలిసిందే. ఇక అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తిరుగులేని మెజారిటీ సాధించి గెలుపొందారు. ఈ క్రమంలోనే మరికొన్ని రోజుల్లో అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసేందుకు సిద్ధమవుతున్నారు జో  బిడెన్.  అయితే సాధారణంగా అమెరికాలో ఒక సారి గెలుపొందిన అధ్యక్షులు మరోసారి కూడా గెలుపొందేందుకు అవకాశం ఉంటుంది అన్న విషయం తెలిసిందే. కానీ ఎన్నో ఏళ్ల తర్వాత డోనాల్డ్ ట్రంప్ విషయంలో అది జరగలేదు.  కేవలం ఒక్క సారి తోనే అధ్యక్ష పదవిని సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది  డోనాల్డ్ ట్రంప్ కి .



మరో  సారీ డోనాల్డ్ ట్రంప్ గెలుస్తాడు అనుకున్నప్పటికీ అది జరగలేదు. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో కూడా ట్రంప్ కి వ్యతిరేకత వ్యక్తం కావడంతో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో  బిడెన్ ఘన విజయాన్ని సాధించారు అయితే విజయం సాధించిన తర్వాత కూడా తానే గెలిచానని...  ఓట్లు తారుమారు చేశారు అంటూ సంచలన ఆరోపణలు చేయడం మొదలు పెట్టారు అన్న విషయం తెలిసిందే. కొన్ని రాష్ట్రాలలో ఓట్లు తారుమారు అయ్యాయి అంటూ న్యాయస్థానాల చుట్టూ కూడా తిరిగినప్పటికీ ట్రంప్ కి ఎదురుదెబ్బలు తగిలాయి.  అయినప్పటికీ ట్రంపు తీరులో మాత్రం మార్పు రావడంలేదు.  ఇప్పటికి కూడాఅధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయాడు  అన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు డోనాల్డ్ ట్రంప్.




 ఇలా ప్రస్తుతం న్యాయస్థానాల్లో  వ్యతిరేక తీర్పులు వస్తున్నప్పటికీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికీ తన ఓటమిని ఒప్పుకోలేక.. ఇప్పటికీ తానే గెలిచాను అంటూ చెప్పుకుంటూ ఉండటం గమనార్హం. ఇటీవలే జార్జియాలోని వాల్దోస్త్ లో  ర్యాలీ కార్యక్రమంలో పాల్గొన్నారు డోనాల్డ్ ట్రంప్. ఈ సందర్భంగా ట్రంప్ నోట మరో సారి అదే మాట వినిపించింది అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మనమే గెలిచాం...రాత్రికి రాత్రే నా ఓట్లను దొంగలించారు అయినప్పటికీ మనమే గెలిచాము..అంటూ ట్రంపు వ్యాఖ్యానించడం ఆసక్తికరంగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: