గ్రేటర్ యుద్దం: ఓట్ల లెక్కింపు కు సర్వం సిద్దం.. తెరాస గెలుపు పక్కా??

Satvika
అందరూ ఉత్కంఠగా ఎదురు చూసిన గ్రేటర్ ఎన్నికల పోలింగ్ ముగిసింది.. దీంతో నగరమంతా ఇప్పుడు ఎన్నికల ఫలితాల మీద పడింది.. ఎన్నికలను ఎప్పుడెప్పుడు అనౌన్స్ చేస్తారా అని రాజకీయ నాయకులు ఒకవైపు ప్రజలు మరో వైపు ఎదురు చూస్తున్నారు.. కాగా ఈరోజు మలక్ పేట లో ఎన్నికలను నిర్వహిస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకు ఈ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే నిర్దేశించిన కేంద్రాల్లో పోలింగ్ ప్రారంభం అయ్యింది.. జనాలు ఓట్లు వెయ్యడానికి బారులు తీరుతున్నారు.. ఈ పోలింగ్ పూర్తయ్యాక ఓట్ల లెక్కింపు ను ప్రారంభించనున్నారు. 



జీహెచ్‌ఎంసి ఎన్నికలకు సంబంధించి పోలింగ్‌ పూర్తయిన నేపథ్యంలో ఈనెల 4వ తేదీన జరిగే ఓట్ల లెక్కింపును పర్యవేక్షించేందుకు తెలంగాణ ఎన్నికల కమిషన్‌ పర్యవేక్షకులను నియమించింది. గ్రేటర్‌ పరిధిలోని 150 డివిజన్లకు సంబంధించి ఓట్ల లెక్కింపు సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖ నుంచి 31 మందిని పర్యవేక్షకులుగా నియమిస్తూ ఎన్నికల కమిషన్‌ కార్యదర్శి అశోక్‌ కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఆ కార్యాలయాల్లో ఓట్ల లెక్కింపు పరిశీలించే అధికారులు ఓట్ల లెక్కింపు ను అణువణువు పరిశీలించనున్నారు. 



ఎన్నికల కమిషన్‌ ఆధ్వర్యంలో పనిచేసే వీరంతా ఎన్నికల కమిషన్‌ ప్రతినిధులుగా ఓటింగ్‌ జరిగే ప్రదేశాల్లో నియమించారు. ఎక్కడ ఎన్నికలు జరిగినా కూడా అక్కడ వీళ్ళను ప్రభుత్వం నియమిస్తుంది. లెక్కింపు ప్రక్రియ లో క్రమశిక్షణ పాటించడం, గొడవలు కాకుండా నియంత్రించడం వంటి చర్యలు తీసుకుంటారు. ఓట్ల లెక్కింపు పర్యవేక్షకులుగా నియమితులైన వారితో ఎన్నికల కమిషనర్‌ గురువారం ఉదయం 11గంటలకు ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ముఖ్యంగా ఓట్ల లెక్కింపును ఎటువంటి ఘర్షణలు లేకుండా జరగడానికి కావలసిన అన్ని ప్రక్రియలను వివరించనున్నారు. ఇప్పటివరకు సర్వే అందించిన వివరాల మేరకు టీఆరెఎస్ ఆధిపత్యం వహిస్తుందని అంచనా.. రేపటితో ఆ సందిగ్ధం కూడా తొలగిపోతుంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: