గ్రేటర్ యుద్ధం: ఎలక్షన్ వెనుక అసలు రహస్యం..... షాక్ తిన్న నేతలు...!

VAMSI
2020 గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జిహెచ్ఎంసి) ఎన్నికలు మొత్తానికి సమాప్తం అయ్యాయి. ఎన్నికల కోసం అన్ని పార్టీలు ఎంత హడావిడి చేశాయో తెలిసిందే... పార్టీ నేతలు ప్రతిపక్షాలపై విమర్శలు వెదజల్లుతూ... ఘాటు వ్యాఖ్యలు చేస్తూ... పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. అభివృద్ధి అజెండా లతో ప్రజలను ఆకర్షించేందుకు ప్రణాళికలను రచించారు.... ముఖ్యంగా అధికార పార్టీ మరియు బిజెపిల మధ్య జరిగిన మాటల యుద్ధం అంతా ఇంతా కాదు... ఇదిలా ఉండగా ఎలక్షన్ కోసం అంత చేసినా నాయకులకు షాక్ ఇచ్చారు ఓటర్లు. గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం ఓటింగ్ శాతం చాలా తక్కువగానే జరిగిందనే చెప్పాలి.

డిసెంబర్ 1 మంగళవారం హైదరాబాద్ లో వివిధ కేంద్రాల వద్ద జరిగిన పోలింగ్ కు ఓటర్లు పెద్దగా రాలేదు.... గత ఏడాది తో పోలిస్తే ఈసారి ఓటు వేయడానికి పెద్దగా ఆసక్తి చూపలేదు ఓటర్లు. దీంతో రాజకీయ నాయకులకు పెద్ద షాక్ తగిలింది. ఊహించని రీతిలో ఆశ్చర్యానికి గురయ్యారు. మొత్తం మీద 45 శాతం మాత్రమే పోలింగ్ జరిగినట్లు తెలుస్తోంది.. ఇదే ఫైనల్ లెక్క కాకపోయినా ఇంచుమించుగా అంతేనని వార్తలు వినిపిస్తున్నాయి... కాగా ఓటర్లు ఎలక్షన్ తేదీని మర్చిపోయారా...??? లేక ఎన్నికలను బహిష్కరించారా ?  అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

మన నేతలు చేసిన హడా విడికి ఎన్నికలు జరిగే తేదీ మర్చి పోయే ప్రసక్తి లేదు కానీ... ఈసారి ఓటింగ్ శాతం తగ్గడానికి ఇంకేదో కారణం ఉందని భావిస్తున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. ఇంతటి దారుణమైన పోలింగ్ శాతం విషయాన్ని పక్కన పెడితే.... ఎంతో కొంత...ఈ ఎన్నికలలో చివరికి గెలిచేదెవరు అన్న ప్రశ్న మన రాజకీయ నాయకుల చుట్టూ తెగ తిరుగుతోంది...!!! ఇంతకీ ఏ డివిజన్లలో ఏ నేత విజయం సాధించబోతున్నారు అన్న విషయం తెలుసుకోవాలంటే రేపటి వరకు ఆగాల్సిందే...!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: