లఢక్ లో చైనా ఓవర్ యాక్షన్.. అమెరికా తీవ్ర ఆగ్రహం..?

praveen
భారత్ చైనా సరిహద్దు ల్లో  ప్రస్తుతం పరిస్థితులు మరింత ఉద్రిక్తం గా మారి పోతుంది అన్న విషయం తెలిసిందే.  భారత్ రెచ్చగొట్టే విధంగా చైనా ను ఎన్నో రకాలు గా సరిహద్దుల్లో  ప్రయత్నం చేస్తోంది. అయితే భారత్ చైనా సరిహద్దు లో తలెత్తిన ఉద్రిక్త పరిస్థితు ల్లోకి అమెరికా కూడా ఇన్వాల్వ్   అయింది అన్న విషయం తెలిసిందే అమెరికా అధ్యక్షుడి గా ట్రంప్  ఉన్న సమయంలో చైనా పై ఆధిపత్యం సంపాదించేందుకు భారత్ తరఫున మాట్లాడేందుకు ఎన్నో సార్లు ప్రయత్నించారు. ఇక ఇప్పుడు జో బైడెన్  వచ్చిన తర్వాత చైనా కు ఫేవర్ గా ఉంటారు అని అనుకున్నారు అందరు.



 కానీ బైడెన్ వచ్చిన తర్వాత కూడా  ఎక్కడా పరిస్థితి లో మాత్రం మార్పు రాలేదు. అంతే కాకుండా అమెరికా లో  ఈ మధ్య కాలంలో బయట పడిన కొన్ని రకాల పరిణామాలు కూడా చైనాపై ప్రస్తుతం అమెరికన్లకు తీవ్రస్థాయిలో వ్యతిరేక తీసుకొచ్చాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఇటీవలే లడఖ్లో చైనా నిర్మాణాలు చేపడుతున్నటువంటి వ్యవహారంపై అమెరికా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సరిహద్దులో చైనా నిర్మాణాలపై శాటిలైట్ చిత్రాలు కూడా బయట పడిన నేపథ్యంలో.. భారత సంతతికి చెందినటువంటి అమెరికా చట్టసభ సభల్లో  చైనా తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.




 సరిహద్దుల్లో చైనా నిర్మాణాలు చేపడుతున్నట్టు వస్తున్న వార్తలు నిజమైతే.. వాస్తవాలను మారుస్తూ చైనా సైన్యం భారత్ రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తుందని.. ఇలాంటివి ఎట్టి పరిస్థితుల్లో అమెరికా అంగీకరించదని.. రానున్న రోజుల్లో దీని పర్యవసానమే చైనా తప్పక వస్తుంది అంటూ అమెరికా వార్నింగ్ ఇచ్చింది. ఇలా భారత్ నుంచి చైనా స్వాధీనం చేసుకున్న విభాగాలలో శాశ్వత నిర్మాణాలు చేస్తూ ఉండటాన్ని  తప్పుబట్టిన అమెరికా రానున్న రోజుల్లో చైనా పర్యవసానాన్ని అనుభవించక తప్పదు అంటూ ఒక రకంగా వార్నింగ్ ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: