గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో బిజెపి జెండా ఎగురవేయాలనే సంకల్పం ఆ పార్టీ జాతీయ నాయకుల్లో బలంగా ఉన్నట్టు కనిపిస్తోంది. అందుకే వరుసపెట్టి అగ్రనేతలు అంతా హైదరాబాద్ టు క్యూ కట్టేశారు. ఒకరిని మించి మరొకరు ఎన్నికల ప్రచారంలో పాల్గొని రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు గుప్పించారు. తాజాగా హైదరాబాద్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ పై సెటైర్లు వేశారు. సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈరోజు గ్రేటర్ లో బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా రోడ్ షో నిర్వహించిన అమిత్ షా అనంతరం బిజెపి కార్యాలయం నుంచి మీడియాతో మాట్లాడారు.
తనకు రోడ్డు షో లో ఘన స్వాగతం పలికిన హైదరాబాద్ ప్రజలు అందరికీ ధన్యవాదాలు అని అమిత్ షా అన్నారు. తాము గ్రేటర్ లో సీట్లు పెంచుకోవడానికి రాలేదని, మేయర్ సీటు గెలుచుకునేందుకు వచ్చామని అమిత్ షా అన్నారు. గ్రేటర్ లో బిజెపి అభ్యర్థి మేయర్ అవుతాడని జోస్యం చెప్పారు. హైదరాబాద్ ను ప్రపంచ ఐటీ హబ్ గా మారుస్తాం అని, అక్రమ కట్టడాలు అన్నీ ఎంఐఎం ఆధ్వర్యంలో ఏర్పాటయ్యాయని, ఆ పార్టీ మార్గదర్శకంలో టిఆర్ఎస్ నడుస్తోందని, బీజేపీకి అవకాశం ఇస్తే అటువంటి అక్రమాలు కూల్చివేస్తామని చెప్పుకొచ్చారు.
హైదరాబాద్ అభివృద్ధికి కేంద్రం పుష్కలంగా నిధులు ఇస్తోందని, సిటీ లో వరదలు వచ్చినప్పుడు కెసిఆర్ ఎక్కడ ఉన్నారు అంటూ అమిత్ షా ప్రశ్నించారు. తన ప్రశ్నలకు కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 100 రోజుల ప్రణాళిక అన్నారు ఏమైంది ? ఇళ్లు కడతామన్నారు ఏమైంది ? ఇచ్చిన హామీలన్నీ టిఆర్ఎస్ పార్టీ మరిచిపోయింది అంటూ అమిత్ షా తనదైన శైలిలో కేసీఆర్ పై సెటైర్లు వేశారు