గ్రేటర్ యుద్ధం : అరిగిపోయిన గ్రామఫోన్ లా కేటీఆర్ మాటలు..?

praveen
ప్రస్తుతం జిహెచ్ఎంసి ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాజకీయ వాడి వేడి గా మారిపోయాయి అనే విషయం తెలిసిందే. ఓవైపు ప్రధాన పార్టీలకు చెందిన ముఖ్య నేతలు అందరూ ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించు  కుంటూ ఉండడంతో తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్ గా మారిపోయాయి. అంతేకాకుండా  ఒకరికి ఒకరు సవాళ్లు కూడా విసుక్కుంటున్నారు. ఇక అదే సమయంలో కేవలం ఆయా పార్టీల ముఖ్య నేతలే కాదు అటు ఆయా డివిజన్లలో పోటీ చేస్తున్న వివిధ పార్టీల అభ్యర్థులు కూడా ఎక్కడా తక్కువ కాదు అని నిరూపించుకున్నారు. ప్రస్తుతం అన్ని డివిజన్లలో ముమ్మర ప్రచారం చేపడుతున్నారు.

 ప్రస్తుతం గ్రేటర్ పరిధిలో ఎక్కడ చూసినా కూడా ఎన్నికల ప్రచారం మోత మోగిపోతుంది అన్న విషయం తెలిసిందే. ఆయా పార్టీల అభ్యర్థులు భారీ ర్యాలీలు నిర్వహించడం అంతేకాకుండా రోడ్ షోలు  నిర్వహించి ఓటర్లను ఆకట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.. ఇంటింటికి తిరుగుతూ తమకు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించడం జరుగుతుంది. దీంతో ప్రస్తుతం ఎక్కడ చూసినా ప్రచార హోరు కనిపిస్తుంది. ముఖ్యంగా మల్కాజిగిరి నియోజకవర్గం లో బీజేపీ అభ్యర్థులు అందరూ ఎంతో వ్యూహాత్మకంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.

 ఈ క్రమంలోనే బిజెపి పెద్దలు కూడా రంగంలోకి దిగి బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్నారు.  ఇక ఇటీవలే మల్కాజిగిరి నియోజకవర్గం లోని 139 వ  డివిజన్ ఈస్ట్  ఆనంద్ బాగ్ బిజెపి అభ్యర్థికి మద్దతుగా దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్రావు ప్రచారం నిర్వహించారు.  ఈ క్రమంలోనే భారీ ర్యాలీ నిర్వహించిన ఆయన బిజెపి అభ్యర్థి బక్క నాగరాజుని గెలిపించాలి అంటూ ఓటర్లను విజ్ఞప్తి చేశారు.  ఈ సందర్భంగా తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పై విమర్శలు గుప్పించారు. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అరిగిపోయిన గ్రామఫోన్ లాగా పదేపదే తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు అంటూ మండిపడ్డారు. బిజెపితోనే అభివృద్ధి సాధ్యం అంటూ చెప్పుకొచ్చారు రఘునందన్ రావు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: