బార్ లకు కేసీఆర్ గుడ్ న్యూస్

టిఆర్ఎస్ గ్రేటర్ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన కేసీఆర్... కీలక వ్యాఖ్యలు చేసారు. దేశంలోనే గొప్ప చరిత్ర గలిగిన నగరం హైద్రాబాద్ అని ఆయన అన్నారు. నిజమైన కాస్మోపాలిటన్ సిటీ మనది అన్నారు. అన్ని రాష్ట్రాల, దేశాల ప్రజలు ఇక్కడ నివసిస్తారు అని ఆయన చెప్పుకొచ్చారు. జంట నగరాల్లో నేడు మంచినీటి కొట్లాటలు లేవు అన్నారు. మిషన్ భగీరథ తో నీటి కోసం వీధి పోరాటాలు పోయాయి అని ఆయన వివరించారు. ఐటి లో ప్రపంచ ప్రశంసలు పొందుతున్నాం అని అన్నారు. హైద్రాబాద్ ను మరింత ముందుకు తీసుకువెళ్లేలా టిఆర్ఎస్ ఎజెండా తయారు చేసాం అని స్పష్టం చేసారు.
జిహెచ్ఎంసికి సమగ్ర చట్టం తెస్తాం అని ఆయన అన్నారు. మిషన్ భగీరథ తర్వాత 24గంటలు మంచినీటి సరఫరా చేస్తాం అని హామీ ఇచ్చారు. జంట నగరాల్లో డిసెంబర్ నుంచి నీటి బిల్లులు ఉండవు అని ఆయన అన్నారు. 20వేల లేటర్లు ఉపయోగించుకునే వారికి ఉచిత నీటి సరఫరా చేస్తాం అని ఆయన స్పష్టం చేసారు. దాని వల్ల 97శాతం ప్రజలకు ప్రయోజనం చేకూరుతుంది అన్నారు. నాలుగు మాసాల తర్వాత రాష్ట్ర వ్యాప్త మున్సిపాలిటీల్లో కూడా ఉచిత నీటిసరఫారాకు చర్యలు చేపడుతున్నామని ఆయన అన్నారు.
ఢిల్లీ లో ప్రస్తుతం ఇది అమలులో ఉంది. మన రాష్ట్రం రెండోది అని ఆయన చెప్పుకొచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా నాయి బ్రాహ్మణుల కటింగ్ సెలూన్ లకు డిసెంబర్ నుంచి ఉచిత విద్యుత్ అని వివరించారు. రజకుల లాండ్రీ, దోబీ ఘాట్ లకు కూడా ఉచిత విద్యుత్ అన్నారు. కరోనా వల్ల రాష్ట్రానికి 52740 కోట్ల నష్టం జరిగింది అని ఆయన వ్యాఖ్యానించారు. హోటల్స్, బార్ అండ్ రెస్టారెంట్, పరిశ్రమలు, వ్యాపార సంస్థలకు 6మాసాల విద్యుత్ చార్జీ రద్దు అని హామీ ఇచ్చారు. మోటార్ వాహనాలు,టాక్సీ లు, క్యాబ్ లకు రెండు త్రైమాసికాల టాక్సీ రద్దు చేస్తున్నాం అని ఆయన వ్యాఖ్యలు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: