రోహిత్ శర్మ సిద్ధమవుతున్నాడు.. మరికొన్ని రోజుల్లో..?

praveen
టీమిండియా క్రికెట్ లో రోహిత్ శర్మ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక సాదాసీదా క్రికెటర్ స్థాయి నుంచి టీమిండియాలో దిగ్గజ క్రికెటర్ గా తన ప్రస్థానాన్ని కొనసాగించారు రోహిత్ శర్మ. జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన నాటి నుంచి నేటి వరకూ కూడా ఎక్కడా వెనక్కి తిరిగి చూసుకోలేదు. టీమిండియాలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటూ... టీమిండియా స్టార్ ఓపెనర్ కుర్చీలో కర్చీఫ్  వేసాడు రోహిత్ శర్మ. ఇక రోహిత్ శర్మ ఒకసారి బరిలోకి దిగాడు అంటే సిక్సుల వర్షం కురుస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో రికార్డులు కొల్లగొట్టిన రోహిత్ శర్మ ఎంతో ఉత్కంఠభరితమైన ఇన్నింగ్స్ ఆడుతూ  అభిమానులందరికీ మరింత హుషారెత్తిస్తు ఉంటాడు.



 అయితే ఇటీవలే ఈ టోర్నీలో కూడా రోహిత్ సారథ్యంలో ఆటలో  కూడా అద్భుతమైన ప్రతిభ కనబరిచడంతో ముంబై ఇండియన్స్ జట్టు ఐదవసారి టైటిల్ అందుకున్న విషయం తెలిసిందే. కాగా ఇటీవలే ఐపీఎల్ టోర్నీ  ముగియగానే అటు నుంచి అటే భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది మొదట ఐపీఎల్లో తొడ కండరాలు పట్టేయడం తో గాయం  కారణంతో రోహిత్ శర్మ ఆస్ట్రేలియా పర్యటనలో సెలెక్ట్ చేయలేదు బిసిసిఐ సెలెక్టర్లు. దీంతో బీసీసీఐ  పై  ఎన్నో విమర్శలు కూడా వచ్చాయి. ఐపీఎల్లో రోహిత్ శర్మ మ్యాచ్ ఆడిన తర్వాత కూడా ఎందుకు ఇంకా గాయం ఉందనే కారణాలు చెబుతున్నారు అంటూ విమర్శలు రాగా  ఎట్టకేలకు బిసిసిఐ మెత్తబడింది.



 ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా టెస్ట్ సిరీస్కు రోహిత్ శర్మను ఎంపిక చేస్తూ బిసిసిఐ నిర్ణయం తీసుకుంది. కాగా ప్రస్తుతం రోహిత్ శర్మ ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ కోసం సిద్ధమవుతున్నాడు. జాతీయ క్రికెట్ అకాడమీలో ఫిట్నెస్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడు రోహిత్ శర్మ. పూర్తిగా గాయం నుంచి కోరుకున్నానని చెబుతున్నప్పటికీ బీసీసీఐ  మాత్రం గాయం నుంచి కోలుకోవడానికి కాస్త సమయం కావాలని కోరింది. దీంతో ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీ చైర్మన్ రాహుల్ ద్రవిడ్ ఆధ్వర్యంలో ఫిట్నెస్ టెస్ట్ చేయించుకున్నాడు రోహిత్ శర్మ. కాగా మరికొన్ని రోజుల్లో ఆస్ట్రేలియాకు వెళ్లనున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: