బాబోయ్: ఆ విషయంలో జగన్ మేలుకోవాల్సిందేనా?

M N Amaleswara rao
అధికార పార్టీలో రోజురోజుకూ ఆధిపత్య పోరు పెరిగిపోతుంది. రాష్ట్రంలో పలు నియోజకవర్గాల్లో వైసీపీ నేతల మధ్య ఆధిపత్య పోరు మరింత ముదురుతుంది. సొంత పార్టీలోనే నేతలకు ఒకరి అంటే ఒకరికి పడటం లేదు. అధికారం చెలాయించే విషయంలో నేతలు తమ ఆధిపత్యమే నడవాలని చూస్తున్నారు. అందుకే చాలా నియోజకవర్గాల్లో వర్గపోరు బాగా ఎక్కువైపోయింది. ఇటీవల కాలంలో అయితే పాదయాత్రలు చేసే విషయంలో నేతల మధ్య వార్ ఎక్కువగానే నడుస్తోంది.
జగన్ పాదయాత్ర చేసి మూడేళ్లు అయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలు తమ తమ నియోజకవర్గాల్లో పాదయాత్రలు చేస్తున్నారు. ఈ సమయంలోనే పలువురు నేతల మధ్య రగడ కూడా రాజుకుంటుంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చాలా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు, వైసీపీ నేతలకు పెద్దగా పడటం లేదు. ఇప్పుడు ఆ ఆధిపత్య పోరు మరింత ముదిరినట్లు కనిపిస్తోంది. ఇప్పటికే టీడీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు వంశీ, కరణం బలరాంల నియోజకవర్గాలైన గన్నవరం, చీరాలలో ఆధిపత్య పోరు ఎక్కువగానే ఉంది.
ఇక వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వార్తల్లో ఉంటున్న నియోజకవర్గం నందికొట్కూరు. ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆర్థర్, సమన్వయకర్త siddharth REDDY' target='_blank' title='బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి వర్గాలకు అసలు పొసగడం లేదు. తాజాగా కూడా బైరెడ్డి చేసిన వ్యాఖ్యలు వైసీపీలో హాట్ టాపిక్ అయ్యాయి. నియోజకవర్గంలో జెండా మోసినవారికి న్యాయం జరగడంలేదని, నియోజకవర్గంలో ముగ్గురు శిఖండి రాజకీయం చేస్తున్నారని ఎదురుదాడి చేశారు. జిల్లాలో పెద్ద నాయకులు వారి పంథా, పద్ధతి మార్చుకోవాలని సిద్ధార్థ రెడ్డి హితవు పలికారు.
అటు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో వైసీపీ నేతల మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి. నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ నరసింహరాజుకు సంబంధం లేకుండా.. వైసీపీ నేతలు పాదయాత్ర నిర్వహించారు. ఇక జగన్ సొంత జిల్లా కడపలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, రామసుబ్బారెడ్డి వర్గాల మధ్య చిన్నపాటి యుద్ధమే జరిగింది. ఇంకా రాష్ట్రంలో పలు నియోజకవర్గాల్లో వైసీపీ నేతల మధ్య వార్ నడుస్తూనే ఉంది. అయితే సీఎంగా జగన్ బాగా బిజీగా ఉన్నారు. ఒకవేళ ఆయన ఇప్పుడు మేలుకుని ఇవన్నీ సరిచేయకపోతే పార్టీకి డ్యామేజ్ జరుగుతుందని కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: