జిల్లాల ఏర్పాటులో కూడా జగన్ కి అడ్డు పడుతున్న చంద్రబాబు..?
తన పెత్తనం వద్దని ప్రజలు చంద్రబాబు పక్కకు పెట్టిన కూడా ఇంకా ప్రజలపై పెత్తనం చేయాలనీ చూస్తున్నాడు చంద్రబాబు.. అయితే తాజాగా అధికార ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీనిపై చంద్రబాబు ఎలాంటి విమర్శలు చెయ్యట్లేదు కానీ తన టీడీపీ నేతలతో దీన్ని వ్యతిరేకిస్తున్నట్లు మాట్లాడిస్తున్నారు.. ఇటీవలే పార్టీ లో పదవుల నియామకం కొత్త జిల్లాల ఏర్పాటుకు అనుగుణంగానే జరిగింది. అప్పుడు చంద్రబాబు ఏ విమర్శలు చేయలేదు. కానీ శ్రీకాకుళం ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు కొత్త జిల్లాల ఏర్పాటును వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించారు.
కొత్త జిల్లాల ఏర్పాటులో రాజకీయమే తనకు కనిపిస్తోదని వ్యాఖ్యానించారు. శ్రీకాకుళం జిల్లాను మూడు జిల్లాలకు విభజిస్తే.. తమ జిల్లాలో ఉన్న పోరాట స్ఫూర్తి దెబ్బతింటుందని చెప్పుకొచ్చారు. కొత్త జిల్లాల ఏర్పాటులో ప్రజల అభివృద్ధి లక్ష్యంగా కనిపించడం లేదన్నారు. ఎంపీ ఇలా మాట్లాడడంతోనే పైన పేర్కొన్న సందేహాలు ప్రజల్లో వస్తున్నాయి. ప్రభుత్వం తీసుకున్న అనేక నిర్ణయాలను అడ్డుకునేలా కోర్టుల్లో పిటిషన్లు వేసిన తెలుగుదేశం పార్టీ జిల్లాల ఏర్పాటును కూడా అడ్డుకునేందకు ఇదే తరహాలో వ్యవహరిస్తుందేమోనన్న సందేహాలు రామ్మోహన్ నాయుడు ప్రకటనతో నెలకొన్నాయి.దీనివెనుక చంద్రబాబు ఉన్నాడని స్పష్టంగా అర్థమవుతుంది. ఎంపీ రామ్మోహన్ నాయుడు కొత్త జిల్లాల ఏర్పాటును వ్యతిరేకిస్తున్నాం అంటూ చేసిన ప్రకటన చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతాన్ని బయటపెడుతోంది.