ఘనత సాధించిన ఆ కుర్రాడిని మెచ్చుకోవాల్సిందే...!
ఈ కుర్రాడిని చూస్తే ఎవరైనా మెచ్చుకుని తీరాల్సిందే . నిజంగా ఈ పిల్లవాడు ప్రపంచాన్ని అబ్బురపరిచాడు. అతిపిన్న వయసు లోనే కంప్యూటర్ ప్రోగ్రామ్ ను అభ్యాసం చేసేశాడు. అంత చిన్న పిల్లవాడు కంప్యూటర్ ప్రోగ్రామ్‌ను అభ్యాసం చేయడం నిజంగా గ్రేట్ కదా...? అయితే ఇటువంటి ఘనత ని సృష్టించింది ఏ విదేశాల కుర్రాడో కాదండి. మన భారతీయుడే. ఆ పిల్లవాడి వయసు ఎంతో తెలిస్తే ఆశ్చర్య పోతారు. తనకి కేవలం 6 సంవత్సరాలే. ఆ అబ్బాయికి ఆరు ఉన్నప్పుడే కంప్యూటర్ ప్రోగ్రామర్‌గా రికార్డును సోంతం చేసుకున్నాడు.
ఈ కుర్రాడి గురించి పూర్తి వివరాల్లోకి వెళితే.. తన తండ్రి తనకు కంప్యూటర్ కోడింగ్ నేర్పించాడని, దాని తరువాత తాను పైథాన్ కంప్యూటర్ కోడింగ్ కోర్సును పూర్తి చేశానని తెలిపారు. 'దాని తరువాత సర్టిఫికేట్ కోసం దరఖాస్తు పెట్టుకున్నాను అని అన్నాడు. అహ్మదాబాద్‌కు అర్హమ్ ఓమ్ టాల్సానియా అనే కుర్రాడు ఈ రికార్డు సొంతం చేసుకోవడం జరిగింది. అంతే కాదు వీటికి ముందు కొన్ని చిన్న గేమ్స్ తయారుచేశాను అని చెప్పాడు.
ఈ బాలుడు ఆ సర్టిఫికేట్ కనుక పొందాలంటే .... వారు సొంతంగా చేసింది చూపమని అడగడం జరిగింది. అప్పుడు ఈ బాలుడు తాను తయారు చేసిన గేమ్స్‌ను పంపడం తో కొన్ని నెలల వ్యవధి లో వారు తనకి సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. ఇలా ఆ రికార్డ్ సొంతం చేసుకున్నట్టు ఆ కుర్రాడు చెప్పడం జరిగింది. టాల్సేనియా మైక్రోసాఫ్ట్ టెక్నాలజీ నుంచి కూడా గుర్తింపు పొందాడని తెలిపారు. అంతే కాదు తనకు ఇలా గేమ్స్ చేయడం , ఆప్‌లు రూపొందిచడం అంటే ఎంతో ఇష్టమని చెప్పాడు ఈ కుర్రాడు. ఇలా తాను అందరికి ఉపయోగ పడాలని అనుకుంటున్నానన్నాడు. ఇలా తాను గ్యాడ్జెట్స్ పై ఆసక్తి చూపేవాడని, ప్రోగ్రామ్ నేర్చుకున్నాడని తండ్రి తెలిపారు.