చంద్రబాబు ను టార్గెట్ చేస్తే బీజేపీ కి ఏమొస్తుంది..?
టీడీపీ కి గట్టి పోటీ ఇవ్వడంతో పాటు వైసీపీ కి కూడా కొంత తలనొప్పిగా మారే అవకాశం ఉంది.. ప్రభుత్వాన్ని విమర్శించడంలో బీజేపీ పార్టీ టీడీపీ కన్నా ఒకడుగు ముందే ఉంది.. అంతర్వేది, రాజధాని విషయాల్లో టీడీపీ ని మించి వైసీపీ ని ఇరుకున పెట్టింది బీజేపీ పార్టీ.. దాంతో వైసీపీ తర్వాత ప్రజాదరణ పొందే పార్టీ గా బీజేపీ త్వరలో నిలవబోతుందని చెప్పొచ్చు. అయితే ఆ దిశగా బీజేపీ ప్రయత్నాలు చేస్తుంది.. ఒకేసారి వైసీపీ పార్టీ ని ఢీ కొంటె కష్టాలు తప్పవని తెలుసుకుని వీక్ గా ఉన్న టీడీపీ ని టార్గెట్ చేస్తుంది..సోము వీర్రాజు అయితే చంద్రబాబు అంటే రెండు మూడు విమర్శలు ఎక్కువే చేస్తున్నాడు.
మరో ఇద్దరు నేతలు కూడా చంద్రబాబు మీద అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. వారే రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి సునీల్ దేవధర్, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావులు.. వీరు తమ విమర్శలతో చంద్రబాబుకు పంటి కింద రాయిలా మారారు. బీజేపీతో సఖ్యతగా మెలుగుతూ వచ్చే ఎన్నికల్లో పొత్తు కుదుర్చుకుందామన్నది చంద్రబాబు ప్రయత్నం. జనసేన కూడా బీజేపీతో ఉండటంతో తనకు కలసి వస్తుందనుకుంటున్నారు. అవసరమైతే ఎక్కువ స్థానాలు ఇచ్చేందుకు కూడా చంద్రబాబు సిద్ధమయ్యారు. కానీ బీజేపీ పార్టీ ఇలా రివర్స్ గేమ్ ఆడుతుండడంతో చంద్రబాబు ఏం చేయాలో అర్థం కానీ పరిస్థితి..