ఇబ్బందుల్లో పవన్ ? బాబు కి మరీ ఇబ్బంది ?

జనసేన అధినేత పవన్కళ్యాణ్ పైకి చెప్పకపోయినా, రాజకీయంగా తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ఒకవైపు క్షేత్రస్థాయిలో జనసేన పార్టీని బలోపేతం చేసుకోవడంతో పాటు, బీజేపీతో కలిసి 2024 ఎన్నికల్లో అధికారం సాధించడమే లక్ష్యంగా ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది  అలా జరగాలంటే ప్రజా సమస్యలపై నిత్యం పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే తాము పొత్తు పెట్టుకున్న బీజేపీ వైఖరి మాత్రం పవన్ కు అసలు అర్థం కావడం లేదు. ప్రస్తుతం ఏపీలో చోటుచేసుకుంటున్న ఏ పరిణామం పైన బిజెపి పోరాడే లా కనిపించడం లేదు దీనికి కారణం జగన్ తో రాజకీయ అవసరాలే. దీంతో బిజెపి వైఖరి కారణంగా పవన్ సైతం సైలెంట్ గా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. 


ఒంటరిగా వివిధ అంశాలపై ముందుకు వెళ్లాలంటే, చాలా విషయాలు బీజేపీ తో ముడిపడి ఉండడం, తాను విమర్శలు చేసే అంశాలలో బిజెపి కూడా సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడడం, ఇవన్నీ పవన్ ను వెనక్కి లాగుతున్నాయి. దీంతో ఈ వ్యవహారం పై స్పందించినా, పెద్దగా ఉపయోగం లేకపోగా తిరిగి తమకు చిక్కులు తెచ్చిపెడతాయి అనే విషయం పవన్ గ్రహించారు. అందుకే సినిమాలపైనే దృష్టి సారించి రాజకీయాలపై కాస్త మౌనంగా ఉంటున్నట్లుగా కనిపిస్తున్నారు.ఇదిలా ఉంటే 2014 ఎన్నికలు దగ్గర నుంచి పవన్ తో దోస్త్ చేసిన తెలుగుదేశం పార్టీ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. 



రాజకీయంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. వైసీపీ ప్రభుత్వం పై ఒంటరిగా పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఈ వ్యవహారంలో ఎలా ముందుకు వెళ్లాలో తెలియని పరిస్థితి ఏర్పడింది పోనీ పవన్ ఏమైనా తమ దారిలోకి వస్తాడా అంటే ఆయన ఇప్పుడున్న పరిస్థితుల్లో బిజెపి నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేకపోవడంతో, ఒంటరిగా వైసిపి ప్రభుత్వం ను ఎదుర్కోలేక టిడిపి తీవ్ర ఇబ్బందులను చవిచూడాల్సి వస్తుంది. అసలు పవన్ సహకారంతో బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నా, అది వర్కౌట్ కావడం లేదు. 



దీంతో అటు పవన్, ఇటు టీడీపీ రెండూ, రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. పవన్ కు బిజెపి లింక్ లేకపోతే, ఎప్పుడో టీడీపీతో అధికారికంగా పొత్తుపెట్టుకుని ఉండేవారు. కానీ ఆ పరిస్థితి ఇప్పుడు లేదు. దీంతో అటు టిడిపి జనసేన రెండూ ఎటు ముందుకు వెళ్లలేని, నిర్ణయం తీసుకోలేని పరిస్థితుల్లో ఉండిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: