పగలంతా కారు డ్రైవర్.. రాత్రి కాగానే.. సరికొత్త అవతారం..?
పగలంతా కారు డ్రైవింగ్ చేస్తూ మంచి వాళ్ళ లాగానే ఉంటారు కానీ రాత్రి అయ్యిందంటే చాలు వారిలో అసలు నిజస్వరూపం బయటపడి కొత్త అవతారం బయటకు వస్తుంది. ఒక ముఠాగా ఏర్పడి దొంగతనాలకు పాల్పడుతూ ఉంటారు. ఇలాంటి ముఠాను ఇటీవలే హైదరాబాద్ ఈస్ట్ జోన్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 18.75 లక్షల విలువచేసే 42 తులాల బంగారు నగలు... 1.5 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇటీవలే రంగారెడ్డి జిల్లా ఆమనగల్ ప్రాంతానికి చెందిన నేనావత్ వినోద్ కుమార్ బాలాపూర్ లో నివసిస్తున్నారు.
ఇక ఇబ్రహీంపట్నం లోని ఓ కాలేజీలో బీటెక్ చదువుతున్నాడు సదరు యువకుడు. ఈ మధ్యకాలంలో చెడు అలవాట్లకు బానిస గా మారిపోయాడు. దీంతో చదువు అటకెక్కింది. దీంతో కాలేజీకి వెళ్లడం మానేసాడు. 2014 నుంచి జల్సాలకు డబ్బులు సరిపోక పోవటంతో చోరీల బాట పట్టాడు. కారు డ్రైవర్గా పని చేస్తూనే రాత్రిళ్లు చోరీకి పాల్పడటం మొదలుపెట్టాడు. ఇప్పటికే పోలీస్ స్టేషన్లో 42 కేసులు కూడా నమోదయ్యాయి. పలుమార్లు జైలుకు కూడా వెళ్ళి వచ్చాడు. దీంతో మరి కొంతమందిని కలుపుకొని ఒక ముఠాగా ఏర్పడి అధ్యక్షుడు దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఇటీవలే నిఘా పెట్టిన పోలీసులు ఈ ముఠాను అరెస్టు చేశారు.