సిద్ధమైన జర్మనీ.. చైనా కు ఊహించని షాక్.. భారత్ కి మరింత బలం..?
దీంతో గొప్ప ఆర్ధిక శక్తిగా ఎదగాలి అనుకున్న చైనాకు ఎన్నో కీలక కంపెనీలు చైనా నుంచి బయటకు రావడంతో భారీ షాక్ తగిలింది అని చెప్పాలి. ఇంకా కేవలం జపాన్ అమెరికా కు సంబంధించిన కంపెనీలు మాత్రమే చైనా నుంచి బయటకు వచ్చాయి అనుకుంటున్న తరుణంలో ఇటీవలే మరో దేశం కూడా ఇదే బాటలో నడిచి చైనా కు భారీ షాక్ ఇచ్చింది. జర్మనీ కూడా ప్రస్తుతం జపాన్ అమెరికా దారిలో నడుస్తూ తమ కంపెనీలను చైనా నుంచి బయటకు తీసుకొచ్చేందుకు నిర్ణయించుకుంది. జర్మనీకి చెందిన ప్రముఖ షూ తయారీ కంపెనీ వాన్ వెల్ ఎక్స్ అనే కంపెనీ పూర్తిగా తమ కార్యకలాపాలను నిలిపివేసింది.
ఇక్కడ మరో విషయం నిన్నటి వరకు తమ కార్యకలాపాలు చైనాలో నిర్వహించిన జర్మనీకి చెందిన సదరు కంపెనీ ప్రస్తుతం భారతదేశంలో తమ కార్యకలాపాలు నిర్వహించేందుకు సిద్ధమైంది. చైనా కు ఊహించని షాక్ అనే చెప్పాలి. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న జర్మనీ కంపెనీ ప్రస్తుతం అక్కడ తమ సంస్థను నెలకొల్పేందుకు సిద్ధమైంది. దీంతో చైనా కు ఊహించని షాక్ తగలడంతో ఉక్కిరిబిక్కిరి అవుతుంది చైనా. ఇక రానున్న రోజుల్లో జర్మనీకి చెందిన మరికొన్ని కంపెనీలు కూడా ఇదే విధంగా భారత్ కు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.