దారుణం : వివాహితను కూడా వదలలేదు.. కిడ్నాప్ చేసి చివరికి..?

praveen
ఈ మధ్య కాలం లో మహిళల పై జరుగుతున్న దాడులు  రోజురోజుకూ పెరిగిపోతున్న తప్ప ఎక్కడా తగ్గుముఖం పట్టడం లేదు అన్న  విషయం తెలిసిందే. ఎన్ని  చట్టాలు తీసుకొచ్చినా ఎన్ని శిక్షలు విధించినా కామాంధుల తీరులో మాత్రం ఎక్కడా మార్పు రావడంలేదు. ఇక కామంతో కళ్లు మూసుకు పోతున్న ఎంతోమంది మృగాల్లు  ఆడపిల్ల కనిపిస్తే చాలు మీద పడిపోయి పశువాంచ తీర్చుకుంటున్నారు. దీంతో ఎంతో మంది ఆడపిల్లల జీవితాలు చింద్రం అయిపోతున్నాయి. ఇక రోజు రోజుకూ తెర మీదకు వస్తున్న సంఘటనల తో సభ్య సమాజం మొత్తం తలదించుకుంటుంది.



 సృష్టికి మూలమైన మహిళలకు ప్రస్తుత సమాజం లో అసలు రక్షణ లేకుండా పోతుంది. బయటికి వెళ్తే ఆకతాయిల నుంచి ఇంట్లో ఉంటే సొంత వాళ్ల నుంచి కూడా లైంగిక వేధింపులు ఎదుర్కొంటూనే ఉన్నారు మహిళలు. ఇక మహిళల పై జరుగుతున్న అత్యాచార ఘటనలు ఒక ఘటన మరువక ముందే మరో దారుణ ఘటన కూడా వెలుగులో కి వస్తు  అందరినీ ఉలిక్కి పడేలా చేస్తున్నాయి. ఇక్కడా ఇలాంటి దారుణాలు ఘటన వెలుగులోకి వచ్చింది. వివాహితను కిడ్నాప్ చేసిన ఘటన ఇటీవలే సంగారెడ్డి జిల్లాలో కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. చివరికి కిడ్నాప్ కు  గురైన సదరు మహిళ ఇటీవలే శవం గా మారిపోయింది.



 ఈ దారుణ ఘటనతో స్థానికులు అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. మంగళవారం అదృశ్యమైన వివాహిత ప్రస్తుతం శవమై కనిపించింది. కొల్లూరు ప్రాంతంలో పనికి వెళ్లి వస్తున్న సందర్భంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆమెను అపహరించారు. తాజాగా ఓ రేకుల షెడ్డులో స్థానికులు ఆమె శవాన్ని  గుర్తించారు. సదరు మహిళ పై అత్యాచారం చేసి అనంతరం హత్య చేసినట్లు ప్రస్తుతం బంధువులు కుటుంబీకులు ఆరోపిస్తున్నారు తమకు న్యాయం చేయాలంటూ రామచంద్రపురం పోలీస్ స్టేషన్  ఎదుట ఆందోళనకు దిగారు బాధిత కుటుంబీకులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: