ఇక నుండి మగవాళ్ళకి కూడానా...!
ఉత్తర్వులు వచ్చినా కానీ ఎవరూ వినియోగించుకోవడం లేదు. దీనికి కారణం సరైన ప్రచారం రాక పోవడమే. ఐతే చైల్డ్ కేర్ లీవ్స్ అంటే కేవలం ఆడ వారికే అనుకోవడం అలవాటైంది. కానీ ఇవి మగవారికి లేకపోవడం వల్ల అవసరం అయిన వాళ్ళు కూడా ఇబ్బందులు పడుతున్నారే తప్ప.. తీసుకోవడం లేదు అని సెంట్రల్ మినిస్టర్ జితేందర్ సింగ్ చెప్పడం జరిగింది. ఎవరు ఈ చైల్డ్ కేర్ లీవ్స్ తీసుకోవచ్చు. ఈ విషయానికి వస్తే..... ఇది అందరికీ రావు. కేవలం భార్యతో విడాకులు అయిన తర్వాత వాళ్ళ పిల్లల సంరక్షణ బాధ్యతలు తండ్రిపై ఉంటే వాళ్ళు తీసుకోవచ్చు.
లేదా భార్య చనిపోయి ఆ పిల్లల సంరక్షణ తీసుకోవాల్సిన అవసరం ఉంటే మాత్రమే ఈ చైల్డ్ కేర్ లీవ్స్ కి ఎలిజిబులిటీ ఉంటుంది అని చెప్పారు. ఈ సెలవులు తీసుకోవాలంటే ముందుగానే అధికారుల పర్మిషన్ తీసుకోవాలి. కావాల్సిన ప్రూఫ్స్ సబ్మిట్ చేయాలి. ఈ చైల్డ్ కేర్ లీవ్స్ తీసుకున్నా వాళ్ళకి 100 శాతం శాలరీ వస్తుంది. మొదటి సంవత్సరం 100 శాతం శాలరీ వస్తుంది కానీ రెండో ఏడాది మాత్రం 80 శాతం మాత్రమే వస్తుంది గమనించండి. లీవ్స్ శాంక్షన్ అయిన తర్వాత మాత్రమే లీవ్స్ తీసుకోవాలి. ఇలా ఈ వివరాలని సెంట్రల్ మినిస్టర్ జితేందర్ సింగ్ చెప్పడం జరిగింది.