కేసీఆర్ ఎలా ఎదుర్కొంటారో మరి...?

తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు కొన్ని కొన్ని పరిణామాలు కాస్త ఆసక్తికరంగా మారుతున్నాయి. ప్రధానంగా రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ బలపడాలని భావించడం ఏమోగానీ టిఆర్ఎస్ పార్టీ మాత్రం కాస్త ఎక్కువగానే ఇబ్బంది పడుతుంది. రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యలు కూడా త్వరలోనే వచ్చే అవకాశాలు ఉండవచ్చు అని కొంతమంది అంచనా వేస్తున్నారు. దానికి తోడు మహారాష్ట్ర, చత్తీస్ఘడ్ నుంచి పెద్ద ఎత్తున మావోయిస్టులు కూడా తెలంగాణ లోకి అడుగుపెట్టారు. దీంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు చాలా వరకు కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి.
ఇప్పటికే తెలంగాణ పోలీసులు తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లో భారీగా మోహరించిన సంగతి తెలిసిందే. దానికి తోడు ఇప్పుడు రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ బలపడే క్రమంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు కూడా టిఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెడుతున్నాయి అనే మాట అక్షరాలా నిజం. సీఎం కేసీఆర్ పైకి చెప్పకుండా లోపల కాస్త ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు. దుబ్బాక ఎన్నికల్లో బిజెపి విజయం సాధించిన లేకపోతే రెండో స్థానంలో నిలిచిన సరే టిఆర్ఎస్ పార్టీ కాస్త ఎక్కువగానే ఇబ్బంది పడే అవకాశాలు ఉండవచ్చు అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
ఏది ఎలా ఉన్నా సరే ఈ పరిణామాలు మాత్రం ఇప్పుడు కాస్త ఆసక్తికరంగా మారాయి. ఇక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ టీఆర్ఎస్ పార్టీని ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. అటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా తెలంగాణలో బీజేపీని బలోపేతం చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయడంతో సీఎం కేసీఆర్ ఇప్పుడు ఎలా ఎదుర్కొంటారు ఏంటి అనేది చూడాలి. ఏది ఎలా ఉన్నా సరే ఈ పరిణామాలన్నీ కూడా రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తున్నాయి. టీఆర్ఎస్ మంత్రులు కూడా ఇప్పుడు బిజెపి ఎదుర్కొనే విషయంలో కాస్త ఇబ్బంది పడుతున్నారు అనే భావన రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: