అమరావతి ఆశల సమాధికి కారణం ఏమిటి?

Purushottham Vinay

ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ న్యూస్ చదవండి... అమరావతిని శంఖుస్థాపన చేసి 5 ఏళ్ళు కావస్తుండడంతో ఆనాటి పరిస్థితులను గుర్తు చేసుకొని తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు మరియు మాజీ చంద్ర బాబు నాయుడు గారు ఆవేదన చెందారు. అమరావతి ఆశల పునాదికి సమాధి పడింది అంటూ మీడియా శోకించింది. ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ విభజన తేదీ నాడు కూడా తెలుగు దేశం పార్టీ వారు కానీ, ఆ పార్టీ కి సంబంధించిన అనుబంధ మీడియా కానీ ఈ స్థాయిలో బాధపడలేదు.అమరావతి కి కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, నిర్మాత, కథానాయకుడు అన్ని చంద్రబాబు నాయుడు అంటూ శంఖుస్థాపన రోజు మీడియా కీర్తించింది.

తర్వాత అమరావతి విషయంలో నిందలను జగన్ , మోడీ గార్ల పై వేసింది మీడియా. నిజానికి అమరావతి కి నేడు ఈ పరిస్థితి రావడానికి కారణం ముమ్మాటికీ చంద్రబాబు నాయుడు గారే. ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుంటే ప్రతి ఫ్రేములోను చంద్రబాబు నాయుడు గారే కనిపిస్తారు. ప్రతి ఊరు నుంచి మట్టి, నీరు అంటూ నాటకీయతను ప్రదర్శించే ప్రయత్నం చేశారే కానీ, రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల ఆత్మలను అమరావతి ఆత్మ తో అనుసంధానం చేసే ప్రయత్నం ఆయన చెయ్యలేదు. అమరావతి భూమి పూజ నాడు సొంత కుటుంబ సభ్యుల కార్యక్రమంగా అది జరిగిందే కానీ, అది రాష్ట్ర ప్రజల కార్యక్రమంలా ఎక్కడా జరగలేదు. అధికారం శాశ్వతంగా తమకు వచ్చిందనే భ్రమనే దానికి కారణం అని స్పష్టంగా ఇక్కడ తెలుస్తుంది..

https://youtu.be/nEOx8OZIGEo



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: