భారీ వర్షం.. ప్రభుత్వం చేసిన తప్పిదం.. రైతులకు శాపం..?

praveen
ఇటీవలే తెలంగాణలో కురిసిన భారీ వర్షాలతో రాష్ట్రం మొత్తం అతలాకుతలం అయిన విషయం తెలిసిందే. అయితే ఈ వర్షాకాలంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రైతుల కళ్లనుంచి ఆనందభాష్పాలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఎంతో ఆనంద పడిపోయిన  రైతన్నలు ఎంతో కష్టపడి పంట సాగు చేశారు ఇక వేసిన పంట చేతికి వచ్చే సమయంలో రైతులందరూ ఆనందంలో మునిగి పోతున్న తరుణంలో ఇటీవలె కురిసిన అకాల వర్షానికి రైతుల పంట మొత్తం దెబ్బతిన్న విషయం తెలిసిందే.  శీతాకాలంలో కూడా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో చేతికి వచ్చిన పంట కాస్తా పూర్తిగా ధ్వంసం అయిపోయింది. దీంతో రైతులందరికీ తీవ్ర నిరాశ మిగిలి పోయింది అని చెప్పాలి.

 దాదాపు రాష్ట్రవ్యాప్తంగా లక్షల ఎకరాల్లో పంటనష్టం జరిగిందని ఇటీవలే వ్యవసాయ శాఖ కూడా అంచనా వేసిన విషయం తెలిసిందే. దాదాపుగా ఇటీవల కురిసిన భారీ వర్షం కారణంగా జరిగిన పంట నష్టం మొత్తం చేతికొచ్చిన పంటే  అంటూ వ్యవసాయ శాఖ గుర్తించింది. గత వారం రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో రాష్ట్రంలో దాదాపుగా 14 లక్షల ఎకరాలకు పైగా పంట నష్టం వాటిల్లినట్లు తెలంగాణ వ్యవసాయ శాఖ అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది. 7.50 లక్షల ఎకరాల్లో పత్తి పంట... 5.10 లక్షల ఎకరాల్లో వరి పంట.. మిగతా రెండు లక్షల ఎకరాల్లో మిగతా పంటలు దెబ్బతిన్నట్లు ఇటీవలే వ్యవసాయ శాఖ అంచనా వేసింది.

 ఇక భారీ నష్టాల కారణంగా పంట నష్టం ఏర్పడి దాదాపు రాష్ట్రవ్యాప్తంగా 7.50 లక్షల మంది రైతులు నష్టాల్లో కూరుకుపోయినట్లు వ్యవసాయ శాఖ తెలిపింది. ఇక ఈ వర్షాకాలం పంటలు బాగా పండాయి అని ఆనందంలో మునిగి పోయిన రైతులకు అకాల వర్షాలు పూర్తిగా నిరాశ మిగిల్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రభుత్వం నుంచి ఏదైనా పంట నష్టం వస్తుందా అని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు రైతులు. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం చేసిన తప్పిదం ప్రస్తుతం రైతుల పాలిట శాపంగా మారి పోయింది. తెలంగాణ రాష్ట్రం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పసల్ భీమా యోజన పథకం నుంచి తప్పుకోవడంతో ప్రస్తుతం రైతులకు ఆ  డబ్బులు కూడా దక్కే అవకాశం లేకుండా పోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: