హైదరాబాద్ : గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం.. ఫన్నీ వీడియో..?

praveen
ఇటీవలే హైదరాబాద్ లో భారీ వర్షాలు కురిసి  ఎంత విధ్వంసం సృష్టించాయో  ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గతంలో భారీ వరదల్లో మునిగిపోయిన కేరళా లాగా  మారిపోయింది హైదరాబాద్ పరిస్థితి. హైదరాబాద్ రహదారులపై వాహనాలతో కాదు బోట్ల పై తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. హైదరాబాద్ చరిత్ర లోనే భారీ వర్షం కురిసిన నేపథ్యంలో హైదరాబాద్ నగరం మొత్తం జలదిగ్బంధంలో వెళ్లిపోయి  మొత్తం నగరాన్ని ముంచెత్తాయి. ఎక్కడికక్కడ రహదారులు దెబ్బతిన్నాయి. కాలనీలలో పూర్తిగా నివాసాల్లో కి నీరు చేరడంతో ఎక్కడ చూసినా పూర్తిగా నీరే  కనిపించింది.

 అయితే హైదరాబాద్ నగరంలో ఇళ్లను  భూమి మీద కాదు పెద్ద పెద్ద చెరువులో ఉన్నట్లుగా తలపించింది పరిస్థితి. ఏకంగా పూర్తిగా ఎక్కడ చూసినా నీరు  నిండిపోవడంతో ఏం చేయాలో తెలియని దుర్భరస్థితిలో గడిపారు  హైదరాబాద్ నగరవాసులు. హైదరాబాద్ నగరం లో వరదలు ముంచెత్తిన నేపథ్యంలో జరిగిన ఘటనలకు  సంబంధించి సోషల్ మీడియా వేదికగా ఎన్నో మీమ్స్  వచ్చి అందర్నీ నవ్విస్తున్న విషయం తెలిసిందే. ఏకంగా వరద నీటిలో కార్లు కొట్టుకుపోవడం... అంతేకాకుండా జనావాసాల్లోకి వరదల కారణంగా ముసలి  రావడం లాంటి ఘటనలు అందరినీ ఆశ్చర్యపరిచాయి.

 ఈ క్రమంలోనే హైదరాబాద్ నగరంలో ఉన్న పరిస్థితి గురించి మాట్లాడుతూ ఇటీవలే ఒక యూట్యూబ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఒక కార్టూనిస్ట్ ఫన్నీ వాయిస్ తో ఈ వీడియోని తయారు చేయగా ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియోలో ఓ వైపు నుంచి హైదరాబాద్ లో నెలకొన్న పరిస్థితి గురించి చెబుతూనే మరోవైపు హైదరాబాద్ లో ఈ పరిస్థితి రావడానికి గల కారణాలు ఏమిటి అనే విషయాలను కూడా వివరంగా చెప్పాడు. రైతులకు సంబంధించిన నష్టాన్ని కూడా ఎంతో స్పష్టంగా వివరించాడు. ఇదంతా ఎంతో ఫన్నీ గా చెప్పాడు. ప్రస్తుతం ఈ వీడియో కాస్త సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: