యూపీలో మరో దారుణం..ప్రియురాలి పై గ్యాంగ్ రేప్..అతి దారుణంగా...
తన ఫ్రెండ్ తో దారుణంగా రేప్ చేయించి అనంతరం ఆమెను చంపేశాడు. వివరాల్లోకి వెళితే.. ఈ అమానుష ఘటన యూపీలోని బారాబంకి జిల్లా లో జరిగింది అయితే ఫ్రెండ్ ను కలిసి వస్తాను అని వెళ్ళిన కూతురు ఇంకా రాకపోవడంతో బయపడిన తండ్రి ఈ విషయాన్ని పోలీసులకు చెప్పి స్టేషన్ లో మిస్సింగ్ కేసును నమోదు చేశాడు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.అమ్మాయి సన్నిహితులను,క్లోజ్ ఫ్రెండ్స్ ను అడిగి తెలుసుకున్నారు. ఇకపోతే ఆ అమ్మాయి ఓ అబ్బాయితో సన్నిహితంగా ఉందని తెలుసుకున్న పోలీసులు ఆ కోణంలో కేసును ముందుకు కదిపారు.
యువకుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో దారుణం వెలుగులోకి వచ్చింది. ఇద్దరం కొద్దికాలంగా ప్రేమించుకుంటున్నామని.. తనను కలిసేందుకు ఇటీవల ఆమె నిరాకరించడంతో చంపేసినట్లు పేర్కొన్నాడు. తన స్నేహితుడితో కలసి ఆమెపై సామూహిక అత్యాచారం చేసి.. అనంతరం ఆమెను కాల్వలో తోసేసినట్లు చెప్పాడు. అమ్మాయి మృత దేహాన్ని గాలించి కాలువలోనుంచి పైకి తీశారు. పోస్ట్ మార్టం కోసం బాడీని ఆసుపత్రికి తరలించారు.గ్యాంగ్ రేప్, హత్య తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి విచారణ చేపట్టారు. కన్న కూతురికి ఇలాంటి పరిస్థితి రావడంతో ఆ తండ్రి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. రెండో సారి ఇలాంటి ఘటన ఇక్కడ జరగడంతో పోలీసులు అలెర్ట్ అయ్యారు..