పదవులు వచ్చినా పెదవులు వీప్పరే ? బాబుకి కాలిపోతోంది ?

నిరాశా నిస్పృహల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ కేడర్ లో నూతన ఉత్సాహం తీసుకువచ్చేందుకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు చేయని ప్రయత్నం అంటూ లేదు. దీనికి తోడు పెద్ద ఎత్తున పార్టీ నుంచి వలసలు జరుగుతూ ఉండటం వంటి పరిణామాలు ఆయనకు ఆందోళనను కలిగించడంతో పాటు, టిడిపి రాజకీయ భవిష్యత్తు కు ఇబ్బందికరంగా మారడంతో, బాబు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మళ్లీ పార్టీకి పునర్వైభవం రావాలంటే పార్టీ పదవులను భర్తీ చేయడమే ఏకైక లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. కొద్ది రోజుల క్రితం పార్లమెంటరీ నియోజకవర్గాల ఇన్చార్జి లను నియమించారు. దీనితో పాటు రాష్ట్ర కమిటీని సైతం చంద్రబాబు ప్రకటించారు.

ఇలా అయినా పార్టీ కేడర్ లో ఉత్సాహం వస్తుందని వైసీపీ ప్రభుత్వం పై పోరాటం చేయడంతో పాటు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ ఆ పార్టీకి మైలేజ్ తగ్గించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని, ఇలా ఎన్నో రకాలుగా బాబు అంచనా వేయగా , పదవులు పొందిన నాయకులు ఎవరూ పెద్దగా ఉత్సాహం చూపించకపోవడం, పదవులు వచ్చినా, పాత తరహా విధానంలోనే వ్యవహరిస్తుండడం, బాబుకు ఆగ్రహం కలిగిస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల నాయకులు అమరావతి వ్యవహారంపై నోరు ఎత్తకపోవడం, అక్కడ గొంతెత్తితే ప్రజల్లో పలుచన అవుతామనే భయం వారిలో కలగడం, ఇలాంటి ఎన్నో వ్యవహారాలు చోటుచేసుకుంటున్నాయి.

పదే పదే బాబు ప్రభుత్వంపై పోరాడాలని ఆదేశాలు జారీ చేస్తున్నా, నాయకుల్లో మాత్రం పెద్దగా ఉత్సాహం అయితే కనిపించడం లేదట. ఇక పార్టీలో సీనియర్ నాయకులు, జూనియర్ నాయకులు ఇదే వైఖరితో ఉండడం, అనవసరంగా ప్రభుత్వం జోలికి వెళ్లే అనవసర తలనొప్పులు తెచ్చుకోవడం ఎందుకు అనే విధంగా వ్యవహరిస్తుండడం వంటివి బాబుకు మహ తలనొప్పి కలిగిస్తున్నాయి. పదవులు ఇస్తే పార్టీ నాయకులు యాక్టివ్ అవుతారు అనుకుని బాబు ఎన్నో ఆశలు పెట్టుకోగా, నాయకులు మాత్రం బాబును తీవ్ర నిరాశకు  గురు చేస్తున్నారట. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల నాయకులు ఏ విషయంలోనూ పెద్దగా నోరు మెదపకపోవడం, ఎప్పుడూ, ఒకరిద్దరు నాయకులు మాత్రమే మీడియా ముందు హడావుడి చేయడం తప్పితే పెద్దగా మార్పు అయితే కనిపించడం లేదట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: