రాగల నాలుగు గంటల్లో ఆ ప్రాంతాల్లో భారీ వర్షాలు...

Satvika
ప్రస్తుతం అల్ప పీడనం కొనసాగుతుండటంతో తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచేస్తున్నాయి ..గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పరిస్థితి దయనియంగా మారింది. కురిసిన భారీ వర్షాలకు చాలా మంది నివాసాన్ని కోల్పోయారు. మరి కొందరు కుటుంబ సభ్యులను పోగొట్టుకున్నారు.ఇంకా చెప్పాలంటే నిన్న మొన్నటి దాకా కరోనా ప్రభావం వల్ల భయంతో వణికిపోతున్న ప్రజలకు ,ఇప్పుడు కురుస్తున్న వర్షాలు ఇంకా కోలుకోలేని పరిస్థితిలోకి నెట్టాయి. రెండు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా కూడా వర్షాలు కురుస్తున్నాయి.

మొన్న కురిసిన వానలకు హైదరాబాద్ వాసులు నరకాన్ని చూసారు.. నగరం మొత్తం నదిని తలపించింది. ఆ పరిస్థితి నుంచి ఇంకా బయటపడని ప్రజలకు మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు బాంబ్ ను పేల్చారు. ఇక ఆంధ్ర ప్రదేశ్ లో కూడా దాదాపు అదే పరిస్థితి కొనసాగుతుంది.వేల ఎకరాల లోని పంట నీట మునగడం తో రైతులు గుండెలు బాదుకుంటున్నారు.. ప్రభుత్వం కొంతవరకు ఆదుకుంటామని చెబుతున్న కూడా ప్రజలు నిరాశలో ఉన్నారు. చేతికొచ్చిన పంట నీట మునగడం తో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇది ఇలా ఉండగా ఇప్పుడు మరోసారి ప్రజలను ఆందోళనకు గురిచేసే వార్త వినపడుతుంది. అల్ప పీడన ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో ఇంకా కొనసాగుతుండటంతో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పుడు మరో నాలుగు ఐదు గంటల్లో కొన్ని ప్రాంతాల్లో కుండపోతగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఆంధ్ర ప్రదేశ్ లో వర్ష ప్రభావం ఎక్కువగా ఉందని చెబుతున్నారు.విశాఖ, ఉభయ గోదావరిజిల్లాలు, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. శ్రీకాకుళం,  విజయనగరం, ప్రకాశం, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో పలు చోట్ల  తేలికపాటి నుంచి జల్లులు పడే అవకాశం ఉందని సూచించారు. ప్రజలు ఈ మేరకు అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ అధికారులు హెచ్చరించారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: