వరద బాధితులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయనున్న జగన్ ప్రభుత్వం...

SS Marvels
ఆంధ్రప్రదేశ్‌లో భారీగా కురుస్తున్న వర్షాల ధాటికి ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించిపోయింది. వరదల్లో చిక్కుకుని ఎందరో ఆకలితో అలమటిస్తున్నారు. తినేందుకు తిండి లేక నానా అవస్థలు పడుతున్నారు. ఈ తరుణంలో రాష్ట్రంలోని వరద బాధితులకు అండగా నిలవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు. బాధితులకు ఉచితంగా నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సంకల్పించింది. వారానికిపైగా వరద ముంపుకు గురైన ప్రాంతాల ప్రజలకు ఈ సరుకులు పంపిణీ చేయనున్నారు.
ఈ మేరకు కృష్ణా, గుంటూరు, పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. వరదల్లో చిక్కుకుని ఇబ్బందులు పడుతున్న ఒక్కో కుటుంబానికి 25 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, లీటర్‌ పామాయిల్‌, కేజీ ఉల్లిపాయలు, కేజీ బంగాళాదుంపలు ఇవ్వాలని ఆదేశించింది.ఇక వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో భారీగా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలకు అనేక ప్రాంతాలు నీటి మునగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వరదల్లో చిక్కుకుని తినేందుకు తిండి లేక అనేక మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ తరుణంలో వారిని ఆదుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: