రీప్లేస్ రోజాకు కలిసొస్తుందా...జగన్ వ్యూహం ఏంటో?
ఈ క్రమంలోనే 2014 ఎన్నికల్లో నగరి నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ టీడీపీ అధికారంలోకి రావడంతో ప్రతిపక్షానికి పరిమితమయ్యారు. అయినా సరే ప్రతిపక్ష ఎమ్మెల్యేగా చంద్రబాబు ప్రభుత్వంపై దూకుడుగా ముందుకెళ్లారు. ఫైర్ బ్రాండ్ నాయకురాలుగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక 2019 ఎన్నికల్లో మరోసారి గెలవడం వైసీపీ అధికారంలోకి రావడంతో రోజాకు మంత్రి రావడం ఖాయమని అంతా భావించారు.
కానీ సామాజికవర్గాల సమీకరణల్లో రోజాకు మంత్రి పదవి దక్కలేదు. కాకపోతే ఏపిఐఐసి ఛైర్మన్ పదవి మాత్రం వరించింది. అయితే నెక్స్ట్ జరగబోయే మంత్రివర్గ విస్తరణలో రోజాకు మంత్రి పదవి రావోచ్చని తెలుస్తోంది. ఎందుకంటే జగన్ ఎలాగో అధికారంలోకి వచ్చినప్పుడే రెండున్నర ఏళ్లలో పనితీరు బాగోని మంత్రులని పక్కనబెట్టి, కొత్తవారికి అవకాశం కల్పిస్తానని చెప్పారు. ఇక ఈ రీప్లేస్‌లో భాగంగా రోజాకు ఛాన్స్ దక్కొచ్చని ప్రచారం జరుగుతుంది. పైగా ప్రస్తుతం ఉన్న మహిళా మంత్రుల్లో ఎవరోకరికి రీప్లేస్ ఖాయమని తెలుస్తోంది.
మహిళా మంత్రులు పెద్ద దూకుడు కనబర్చడం లేదని తెలుస్తోంది. అదే రోజా లాంటివారికైతే ఇంకా తిరుగుందని అంటున్నారు. టీడీపీకి ఎప్పటికప్పుడు చెక్ పెట్టగలిగే రోజా లాంటి వారు మంత్రి వర్గంలో ఉంటే ప్లస్ అవుతుందని కొందరు వైసీపీ కార్యకర్తలు భావిస్తున్నారు. అటు రోజా కూడా మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారని ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. ఇక జగన్ కరుణిస్తే నెక్స్ట్ మంత్రి వర్గ విస్తరణలో రోజాకు బెర్త్ ఖాయమని చెప్పొచ్చు.