రైతులకు శుభవార్త... పశువులు కొనేందుకు భారీ రుణం..?

praveen
రైతుల ఆదాయం పెంచి వ్యవసాయ అభివృద్ధికి మరింత తోడ్పాటు అందించే విధంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంది అనే విషయం తెలిసిందే.  రైతులకు ఆర్థికంగా అండగా  నిలిచేందుకు ఎన్నోరకాల పథకాలను కేంద్రం కూడా అందుబాటులోకి తెస్తూ  ఉంటుంది. పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతుంది కేంద్ర ప్రభుత్వం. ఇక ఇటీవలే ఏకంగా  హర్యానా ప్రభుత్వం కూడా పశు  కిసాన్ క్రెడిట్ కార్డ్ అనే ఒక కొత్త స్కీమ్ రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ స్కీం లో భాగంగా రైతులందరూ కూడా ఎంతో సులభంగా రుణాలు పొంది ఆర్థికంగా మరింత బలపడేందుకు అవకాశం ఉంటుంది.


 ఇప్పటివరకు ఏకంగా హర్యానా రాష్ట్రంలో 60వేల మందికి పైగా రైతులకు  ఈ పథకం ద్వారా ప్రయోజనాలు అందినట్లు అక్కడి ప్రభుత్వం తెలిపింది. దాదాపు రాష్ట్రంలో ఉన్న ఎనిమిది లక్షల మంది రైతులకు ఈ కిసాన్ క్రెడిట్ కార్డులను జారీ చేస్తున్నాము అంటూ చెప్పుకొచ్చింది హర్యానా ప్రభుత్వం. కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీం నిబంధనలే పశు కిసాన్ క్రెడిట్ కార్డుకు  కూడా వర్తిస్తాయి అని తెలిపింది. రైతులందరూ ఎలాంటి గ్యారెంటీ లేకుండా 1.6 లక్షల వరకు రుణం పొందేందుకు అవకాశం ఉంటుంది. ఆవులు గేదెలు లాంటివి కొనుగోలు చేసి మరింత ఆదాయాన్ని పొందాలనుకునే రైతులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.

 ఇక ఆయా బ్యాంకులు కూడా ఈ స్కీమ్ ను ప్రజల్లోకి తీసుకెళ్ళి  మరింత అవగాహన పెంచి  ప్రభుత్వం కల్పించిన ప్రయోజనాలకు ఉపయోగించుకునే విధంగా పలురకాల క్యాంపులను కూడా నిర్వహిస్తూ ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే అర్హత కలిగిన ప్రతి ఒక్క రైతుకు ఇలాంటి రుణం అందించాలి అంటూ హర్యానా ప్రభుత్వం అక్కడి బ్యాంకులను కోరడం గమనార్హం. పశు కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా మూడు లక్షల వరకు రుణం పొందవచ్చు. ఎంతో మంది రైతులు తమ వద్ద పశు సామర్థ్యాన్ని పెంచుకోవడమే  కాదు కార్డు  ద్వారా రుణాలు తీసుకుని... తద్వారా పశుసంపదను పెంచుకుని మరింత ఆదాయాన్ని ఆర్జించేందుకు అవకాశం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: