చైనా సరిహద్దు లో 60 మంది సైనికులు చనిపోయారు.. అసలేం జరిగింది..?

praveen
ఎంతో ప్రశాంతంగా ఉన్న భారత్ చైనా సరిహద్దుల్లో విస్తరణ వాదంతో చైనా నిషేధిత ప్రాంతంలో కి వచ్చి తిష్ట వేసుకొని గుడారాలు ఏర్పాటు చేసుకోవడంతో సరికొత్త వివాదానికి తెరలేపడంతో  సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎంతో హుందాగా  వెనక్కి వెళ్లాలి అంటూ భారతసైన్యం చెప్పిన నేపథ్యంలో మూకుమ్మడిగా చైనా సైన్యం దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇరుదేశాల సైన్యాల మధ్య పరస్పరం ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో ఏకంగా 20 మంది భారత సైనికులు అమరులయ్యారు. గాల్వన్  ఘర్షణలో  అమరులైన సైనికులు  అందరికీ అధికారిక లాంఛనాలతో ఎంతో గౌరవంగా అంత్యక్రియలు నిర్వహించింది భారత్.

 చైనా మాత్రం ఇలాంటి విషయాలను ఏవి బయటపెట్టకుండా ఎంతో రహస్యంగా ఉంచింది.  కానీ ఎట్టకేలకు ఏకంగా 150 మంది వరకు చనిపోయినట్లు బయట పడిన విషయం తెలిసిందే. ఇక ఆ తర్వాత భారత్ చైనా మధ్య ఎన్ని సార్లు చర్చలు జరిపినప్పటికీ చర్చలు విఫలం అవుతూనే ఉన్న విషయం తెలిసిందే. అయితే పాంగ్వాన్  సరస్సు దగ్గర జరుగుతున్న పలు ఘటనల గురించి ఇటీవలే పలువురు నిపుణులు  కీలక విషయాలను గుర్తించారు. భారత చైనా సరిహద్దుల్లో ఉన్న పాంగ్వాన్  సరస్సు వద్ద ఏకంగా 60 మంది చైనా సైనికులు ఇటీవలే చనిపోయినట్లు పలువురు  రక్షణ రంగ నిపుణులు గుర్తించినట్లు తెలుస్తోంది.


 అయితే పాంగ్వాన్ సరస్సు  దగ్గర ఎందుకు చైనా కు సంబంధించిన 60 మంది సైనికులు చనిపోయారు అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే పాంగ్వాన్ సరస్సు దగ్గర ఏదో రహస్యంగా జరుగుతుంది అని విశ్లేషకులు భావిస్తున్నారు. పాంగ్వాన్ సరస్సు దగ్గర భారత్-చైనా సైనికుల మధ్య పరస్పరం కాల్పులు జరగడం కానీ లేదా దాడులు  జరుగుతున్నాయా.. లేక సరిహద్దుల్లో ఉన్న వాతావరణ పరిస్థితులను తట్టుకోలేక చైనా సైనికులు మృతి చెందారా అన్నది సంచలనంగా మారిపోయింది. ఈ క్రమంలోనే గతంలోనే వివరాలు తెలపని చైనా ఈసారి కూడా వివరాలు తెలిపే  అవకాశం లేదు అని అంచనా వేస్తున్నారు నిపుణులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: