కరోనా ఎఫెక్ట్.. జనాలు అవి బాగా వాడుతున్నారు.. ఆ కంపెనీకి లాభాలే లాభాలు..?
ఇలా రోజురోజుకు కరోనా వైరస్ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రజలందరూ ఇక వైరస్ తో సహజీవనం తప్పదు అని భావించి తగిన జాగ్రత్తలు తీసుకోవడానికి రోగనిరోధకశక్తి పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఒకవేళ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కరోనా వైరస్ బారిన పడితే తట్టుకునేలా రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే ఎన్నో ఆరోగ్య చిట్కాలు పాటిస్తూ ఉన్న విషయం తెలిసిందే.
ఇలా కరోనా వైరస్ నుంచి కాపాడుకోవడానికి ఇమ్యూనిటీపవర్ పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో ప్రస్తుతం కొన్ని కంపెనీలు మాత్రం ఎంతో లాభాల బాటలో నడుస్తున్నట్లు తెలుస్తోంది ప్రస్తుతం కరోనా వైరస్ సమయంలో మాత్రం భారీగా లాభం పొందుతున్నాయట సైకిల్ తయారీ సంస్థలు. ఆరోగ్య భద్రత ఫిట్నెస్ దృశ్య సైకిళ్లను కొనేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారట జనాలు. ఈ క్రమంలోనే గత 5 నెలల సమయంలో అమ్మకాలు రెట్టింపు అయినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది మే నుంచి సెప్టెంబరు మధ్య 40,82,945 సైకిళ్లు అమ్ముడు అయ్యాయట. దేశవ్యాప్తంగా సైకిళ్లకు భారీగా డిమాండ్ పెరిగి పోయిందని ముందస్తుగా బుక్ చేసుకుంటే తప్ప సైకిల్ దొరకడం లేదు అని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.