గుడ్ న్యూస్ చెప్పిన సీఎం జగన్‌ ...వారికి 5 లక్షలు..

Satvika
జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలను అమలు చేయడంలో దూసుకుపోతుంది. రైతుల కష్టాలను తీర్చింది, మహిళలకు రుణాలను మంజూరు చేసింది.. విద్యార్థులకు విద్యాకానుక పథకాన్ని అమలు చేసింది.. వృద్దులకు, పింఛన్లను పెంచింది.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పథకాలను ప్రజల సంక్షేమం కోసం అమలు చేస్తూ అన్ని రకాలుగా ప్రయత్నిస్తుంది. కరోనా ఒక వైపు , దేవాలయాల పై దాడి మరోక వైపు వంటి సమస్యలు ఎన్ని వచ్చిన జగన్ సర్కారు వెనకడుగు వేయకుండా ముందుకు సాగుతుంది.

ఇప్పుడు మరో కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. కరోనా సమయంలో ఫ్రంట్ వారియర్స్‌గా నిలబడిన వారిలో కీలకంగా వ్యవహరించిన జర్నలిస్టులకు అండగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ప్రాణాలను పణంగా పెట్టి వైరస్‌పై ప్రజల్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ విధులు నిర్వహిస్తూ.. ప్రాణాలు కోల్పోయిన జర్నలిస్టుల కుటుంబాలను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. కరోనాతో చనిపోయిన ప్రతి జర్నలిస్ట్‌కు రూ.5 లక్షల పరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చాడు. అందుకు సంబంధించిన అధికారులకు వెంటనే ఈ పనులను పూర్తి చేయాలని ఆదేశించారు.

ఈ విషయాన్ని స్వయంగా ఇండియన్‌ జర్నలిస్ట్‌ యూనియన్‌ అధ్యక్షులు కే శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. కరోనా గురించి సమాచారాన్ని చిటికెలో అందించిన జర్నలిస్టులు కొందరు ప్రాణాలను సైతం విడిచారు. ఆంధ్రాలో దాదాపు 38 మంది జర్నలిస్టులు ప్రాణాలను కోల్పోయారు. ఈ విషయం పై తీవ్ర చర్చలు జరిపిన జగన్ ప్రభుత్వం వారి కుటుంబాలకు 5 లక్షల భీమా ను అందించాలని సూచించారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామ కృష్ణారెడ్డి, జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్‌కు ప్రత్యేక అభినందనలు తెలిపారు. జర్నలిస్టులు బాగుంటే దేశం బాగుంటుంది. వారి శ్రేయస్సు కోసం ప్రభుత్వం ఎప్పుడు ముందు ఉంటుందని జగన్ పేర్కొన్నారు. జగన్ తీసుకున్న ఈ నిర్ణయం పై జర్నలిస్టులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.. వేరే ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇక్కడ చేయడం గ్రేట్ అంటూ జగన్ ను అభినందించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: