అనిల్ అంబానీ దివాలా కేసులో కొత్త ట్విస్టు!
అప్పులు తీసుకునేటప్పుడు బ్యాంకు వారు భారీ షూరిటీ తప్పనిసరి అనడంతో అనీల్ తన వ్యక్తిగత ఆస్తులను గ్యారెంటీగా పెట్టాల్సి వచ్చింది. తర్వాత జరిగిన పరిణామాల్లో వ్యాపారాలన్నీ అనుకోని రీతిలో దెబ్బతగిలి నష్టం వాటిల్లింది. ఇదే సమయంలో వ్యాపార విస్తరణ కోసమని ఎస్బీఐ దగ్గర కూడా భారీగానే అప్పు చేశారు. దీనికి కూడా తన ఆస్తులనే షూరిటిగా పెట్టారు అంబానీ. మొత్తం మీద కొంతకాలం తర్వాత వ్యాపారాలన్నీ ఊహించని విధంగా నష్టాల్లో కూరుకుపోయాయి. అయితే అప్పులు తీసుకునేటప్పుడు అనీల్ తన వ్యక్తిగత ఆస్తులను గ్యారెంటీగా పెట్టారు. తర్వాత జరిగిన పరిణామాల్లో వ్యాపారాలన్నీ దెబ్బతిన్నాయి.
మొత్తం మీద కొంతకాలం తర్వాత వ్యాపారాలన్నీ నష్టాల్లో కూరుకుపోయాయి. దాంతో బ్యాంకులకు అప్పులు చెల్లించలేని పరిస్థితికి అంబానీ చేరుకున్నారు..... కనీసం వడ్డీలు కూడా చెల్లించలేని పరిస్థితికి చేరుకున్నాడు. ఈ నేపధ్యంలోనే హఠాత్తుగా ఎస్బీఐ కూడా అనీల్ పై ఢిల్లీ కోర్టులో పిటీషన్ వేసింది. ఆస్తులు వేలం వేసి అప్పును రికవరీ చేసుకోవాలన్న చైనా బ్యాంకుల ప్రయత్నాలను ఆపాలంటూ కేసు వేసింది. ఎందుకంటే అనీల్ ఆస్తులను వేలం వేయగా వచ్చే మొత్తాన్ని చైనా బ్యాంకులు తీసుకుంటే తమ అప్పు ఎలా తీరుతుందన్నది ఎస్బీఐ వాదన.