గుడ్ న్యూస్ : ఇక ప్రైవేట్ స్కూల్ ఫీజు ఈఎంఐ రూపంలో..?

praveen
పిల్లలను మంచి స్కూలు కాలేజీలలో చదివించే ప్రయోజకులను చేయాలని తల్లిదండ్రులు అందరూ ఎంతో ఆశ పడుతూ ఉంటారు. కానీ నేటి రోజుల్లో మాత్రం విద్య అంటే ఎంతో ఖర్చుతో కూడుకున్నదిగా మారిపోయింది. ప్రైవేటు పాఠశాలల్లో చదివించాలి అంటే అది తల్లిదండ్రులకు భారంగా మారింది అని చెప్పాలి. ఎందుకంటే మంచి పేరున్న పాఠశాలలు  ఎక్కువ మొత్తంలో ఫీజులు కూడా వసూలు చేస్తూ ఉంటాయి. దీంతో చాలామంది స్కూల్ ఫీజు ఒకేసారి చెల్లించేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. అయితే ఇక పాఠశాలలు తల్లిదండ్రుల విషయంలో ఆలోచన చేసి స్కూల్ ఫీజు రెండు లేదా మూడు దఫాలుగా చెల్లించేందుకు అవకాశాలు కల్పిస్తూ ఉంటాయన్న విషయం తెలిసిందే.



 ఇలా రెండు లేదా మూడు దఫాల లో స్కూల్ ఫీజు చెల్లించేందుకు కూడా ఎంతో మంది విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇక ఇలాంటి వారి కోసమే  ఎడ్యుకేషన్ ఫిన్ టెక్  స్టార్టప్ శుభవార్త తెలిపింది. గ్రేక్వెస్ట్ అనే సంస్థ స్కూల్ యూనివర్సిటీ ఆన్లైన్ కోర్సు ఫీజు ఈఎంఐ రూపంలో చెల్లించే అవకాశం కల్పిస్తోంది. అది కూడా అదనపు చార్జీలు లేకుండానే ఈ అవకాశం కల్పిస్తూ ఉండటం గమనార్హం. ఒకవేళ ఎడ్యుకేషన్ ఫీజు పూర్తిగా రెండు లక్షల వరకు ఉంది అనుకుంటే... ఇక ఈఎమ్ఐ స్కీమ్ లో భాగంగా రెండు లక్షల ను 20 వేల చొప్పున పది దఫాలుగా చెల్లించే అవకాశం ఉంటుంది.



 ఆరు నెలల నుంచి 11 నెలల కాలంలో మీరు ఎడ్యుకేషన్ లోను పూర్తిగా కట్టవచ్చు. అంతేకాదు గ్రేక్వెస్ట్  ద్వారా ఎడ్యుకేషన్ ఫీజు చెల్లించే వారికి ఎన్నో రకాల ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఈ గ్రేక్వెస్ట్ ద్వారా ఎడ్యుకేషన్ ఫీజు చెల్లించే విద్యార్థుల తల్లిదండ్రులు అందరికీ ఎలాంటి అదనపు ఫీజు లేకుండానే ఉచితంగా 20 లక్షల వరకూ ఇన్సూరెన్స్ లభిస్తుంది. 35 మంది  స్టూడెంట్స్ సెంట్రిక్ అవార్డు కూడా పొందేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పుడు వరకు గ్రేక్వేస్ట్ దేశవ్యాప్తంగా 2500కు పైగా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ తో భాగస్వామ్యం కుదుర్చుకుని ఎంతో మంది తల్లిదండ్రులకు చేయూత అందిస్తోంది. ప్రస్తుతం ప్రైవేటు విద్యా సంస్థలకు  అధికంగా ఫీజులు కట్టేందుకు ఇబ్బంది పడుతున్న తల్లిదండ్రులు అందరికీ ఇది ఒక సువర్ణావకాశం అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: