కర్ణాటకలో కలకలం సృష్టిస్తున్న మరో పరువు హత్య..

Satvika
ప్రస్తుతం పరువు హత్యలు కలకలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.. తెలుగు రాష్ట్రాలు ఈ హత్యలు చాలానే వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా ప్రణయ్ హత్య సంచలనంగా మారింది. ఆతర్వాత నిన్న జరిగిన హేమంత్ హత్య హాట్ టాపిక్ గా మారడమే కాదు అనేక చర్చలకు దారితీసింది.  కులాంతర వివాహాలు చేసుకున్నారని అమ్మాయిల కుటుంబ సభ్యులు అబ్బాయిని అతి దారుణంగా చంపేస్తున్నారు. కుల హత్యలు జరగకుండా ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కూడా ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయి.. కులం ఒకటే కాదని అమ్మాయి తండ్రులు పరువు పోయిందనే ఉద్దేశ్యం తో ప్రాణాలను తీస్తున్నారు.

ఇది ఇలా ఉండగా ఇప్పుడు మరో పరువు హత్య కలకలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.. కర్ణాటకలో మరో పరువు హత్య వెలుగు చూసింది. వేరే కులం అబ్బాయిని పెళ్లి చేసుకుందని కూతురి భర్తను బెల్ట్ తో అతి కిరాతకంగా చంపేశారు. కర్ణాటక మగాడి ప్రాంతానికి చెందిన యువకుడు లక్ష్మీపతి, అదే ప్రాంతానికి చెందిన యువతి గతంలో ఓ ఫ్యాక్టరీ లో కలిసి ఉద్యోగం చేశారు. ఆ తరుణం లో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. కులాలు వేరు కావడంతో పెళ్లికి పెద్దలు నిరాకరించారు.



సెప్టెంబర్ నెలలో ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి చేసుకున్నారు. దాంతో అమ్మాయి కుటుంబ సభ్యులు కోపంతో రగిలి పోయారు. కూతురిని పెళ్లి చేసుకోవాలని కలలో కూడా అనుకోవద్దంటూ బెదిరింపులకు దిగాడు. అందుకు లక్ష్మీపతి లొంగకపోవడంతో కులం పేరుతో నానా బూతులు అన్నారు. తమ కూతురిని వదిలేయలంటూ ఎంత చెప్పినా వినలేదని అమ్మాయి తండ్రి కోపంతో బెల్టు తో ఉరి బిగించి చంపేశాడు. కళ్లముందే తమ్ముడిని చంపేయడంతో భయపడిపోయిన అన్న నటరాజ్ అక్కడి నుంచి పారిపోయి పోలీసులకు సమాచారం అందించాడు. అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: