ఇండియన్ రోడ్లపై నడవనున్న ఎలక్ట్రిక్ బస్సులు.. ఎక్కడంటే
ఒకవేళ ఎలక్ట్రిక్ బస్సులు సమర్ధవంతంగా రోడ్లపై నడవగలిగితే ఇంకా మూడు వందల ఎలక్ట్రిక్ బస్సులను తయారు చేయమని "ఒలెక్ట్రా గ్రీన్టెక్ లిమిటెడ్" ని బెంగళూరు ప్రభుత్వం కోరాలని భావిస్తోంది. ఒకవేళ బస్సులు అన్ని టెస్టులలో సమర్థవంతమైనవి గా తేలితే.. ఇకపై బెంగళూరు లో దాదాపు చాలా వరకు ఎలక్ట్రిక్ బస్సులే ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేస్తాయి. ప్రస్తుతం ఈ బస్సు లో 37 మంది ప్రయాణికులు ప్రయాణం చేయొచ్చు. కానీ ఈ బస్సులో 60 మంది ప్రయాణికులు కూర్చునేందుకు కావాల్సిన సీట్లు ఉన్నాయి. అయితే ప్రస్తుతం ప్రయాణికులను సీట్లలో కూర్చోబెట్టకుండా ఇసుక బస్తాలను సీట్లలో కూర్చోపెట్టి బస్సులను నడుపుతారు.
15 రోజులపాటు ప్రయాణికులు లేకుండానే ట్రయిల్ రన్ కొనసాగనున్నదని బిఎంటిసి డైరెక్టర్ సంతోష్ బాబు వెల్లడించారు. ఈ బస్సులను ఎలా నడపాలో ఎవరికీ తెలియదని.. అందుకే కనీసం ఒక నెల రోజుల పాటు రోడ్లపై ఈ బస్సులను నడిపి.. ఆ తర్వాత ఎలక్ట్రిక్ బస్సుల గురించి తుది నిర్ణయానికి వస్తామని సంతోష్ బాబు వెల్లడించారు. నిజానికి 2014వ సంవత్సరంలోనే ఎలక్ట్రిక్ బస్సులను కర్ణాటక రాష్ట్రంలో ట్రయిల్ రన్ చేసారు. కానీ అప్పట్లో డీజిల్ బస్సులతో పోలిస్తే ఎలక్ట్రిక్ బస్సుల ధర చాలా ఎక్కువగా ఉండటంతో.. ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేయలేదు. కానీ హైదరాబాద్ కి చెందిన తయారీ సంస్థ తక్కువ ధరలకే బస్సులను విక్రయిస్తామని చెప్పడంతో బెంగళూరు ప్రభుత్వం ఎలక్ట్రిక్ బస్సులకు ట్రయిల్ రన్ నిర్వహిస్తోంది.