కామంతో ఊగిపోయిన యువకులు.. యువతిని కిడ్నాప్ చేసి.. 15 రోజుల తర్వాత..?
రోజురోజుకు తెర మీదకి వస్తున్న ఘటనలు చూస్తుంటే అసలు ఆడపిల్లకు ఎక్కడ రక్షణ లేదు అన్నది అర్ధమవుతుంది. ఈ మధ్య కాలంలో దేశంలో తరచుగా ఆడపిల్లలపై అత్యాచారం ఘటన వెలుగులోకి వస్తూనే ఉన్న విషయం తెలిసిందే. ఇటీవలే పశ్చిమగోదావరి జిల్లాలో కూడా మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. యువతిపై జరిగిన దారుణ హత్య ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిడదవోలు మండలం సమిశ్రగూడెం గ్రామానికి చెందిన యువతి... గత నెల 21వ తేదీన అదృశ్యం అయింది. ఇక ఆ తర్వాత యువతి తల్లిదండ్రులు కంగారు పడిపోయి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
ఇక మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ యువతి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కానీ ఆ తర్వాత దారుణం నిజం బయటపడింది. తూర్పుగోదావరి జిల్లా బొమ్మూరు కు తీసుకెళ్లి యువతిపై దారుణంగా అత్యాచారం చేశారు అని నిజం బయటపడింది. 15రోజుల తర్వాత ఆ యువతి గ్రామానికి చేరుకోవడం తో పోలీసులు యువతని విచారించారు. తనను కిడ్నప్ చేసి దారుణంగా అత్యాచారం చేశారు అన్న విషయాన్ని పోలీసులకు తెలిపింది యువతి . ఈ ఘటన పై పోక్సో చట్టం వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.