ఏపి లో మళ్లీ భారీగా పెరిగిన కరోనా.. ఆ జిల్లాలో హైలెట్

Satvika

ఏపిలో కరోనా ప్రభావం రోజు రోజుకు పెరుగుతూ ప్రజల ప్రాణాలను హరించి వేస్తుంది.. ఇప్పటికే లక్షల మంది కరోనా బారిన పడి చికిత్స ను పొందుతున్నారు. వేల మంది కరోనా తో పోరాడి మృత్యువు ఒడిలోకి చేరారు.  ఈ వైరస్ వల్ల చాలా మంది భయపడి ముందే చనిపోతున్నారు. జీతాలు లేక జీవితాలను లాగలేక ప్రాణాలను కోల్పోతున్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో ఈ పరిస్థితి మరింత దారుణంగా మారింది..  భారత దేశంలో కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న రాష్ట్రాలలో  ఏపి రెండో స్థానంలో ఉంది. మొదటి స్థానంలో మహారాష్ట్ర ఉంది.

ఇది ఇలా ఉండగా కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరిగిపోయాయి. సోమవారం భారీగా పడిపోయిన కేసులు మంగళవారం మళ్లీ ఒక్కసారిగా పెరిగాయి. అయితే కరోనా మరణాలు మాత్రం తగ్గిపోయాయి. గడిచిన 24 గంటల్లో నమోదు అయిన కరోనా కేసుల విషయానికొస్తే 65,889 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 5,795 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో కరోనా కేసులు 7,30 వేలకు చేరువలో ఉన్నాయి. ఇక నిన్నటితో పోలిస్తే కరోనా మరణాలు కాస్త ఊరట ను కలిగిస్తున్నాయి. ఈరోజు 30 మంది కరోనా తో మరణించారు.దీంతో కరోనా వల్ల మరణించిన వారి సంఖ్య 6,052కు చేరుకుంది.

ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా నమోదైన మొత్తం 7,29,307 పాజిటివ్ కేసులకు గాను, 6,72,479 మంది డిశ్చార్జి కాగా, ప్రస్తుతం 50,776 మంది కరోనా వల్ల చికిత్స పొందుతున్నారు. జిల్లాల వారీగా కరోనా మరణాలు తగ్గిన కూడా తూర్పు గోదావరి, చిత్తూరు, పశ్చిమ గోదావరి జిల్లాలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుతున్నాయి. ప్రజలు ఎంత స్వీయ జాగ్రత్తలు పాటిస్తూన్నా కూడా మహమ్మారి పెరుగుతుండటంతో జీవితం మీద ఆశలను వదిలేశారు. చచ్చేంత వరకు బ్రతుకుదాం అని నిర్ణయానికి వచ్చారు. మరి ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టే వ్యాక్సిన్ వచ్చే లోగా సగం రాష్ట్రం ఖాళీ అవుతుందని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: