చైనాతో నేపాల్ వింత ఒప్పందం.. భారత్ కి ప్రమాదం..?

praveen
భారత్ ను ఢీ కొట్టి ఆధిపత్యం సంపాదించాలి అనుకున్న చైనా కు భారీ షాక్ తగులుతుంది. భారత్  ఎక్కడ వెనకడుగు వేయకుండా దీటుగా నిలబడి బదులిస్తోంది. ఇలాంటి నేపథ్యంలో భారత్ చుట్టూ కంచె వేయడానికి ప్రయత్నిస్తుంది.  చైనా ఏకంగా పాకిస్తాన్ నేపాల్ దేశాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఆర్థిక సహాయం పేరుతో పాకిస్తాన్ ను  బానిస  మార్చుకోగా... అమ్మాయిల వల వేసి నేపాల్ దేశాన్ని  కూడా తమ చెప్పుచేతల్లో కి తెచ్చుకుంది. కేవలం తమ చెప్పు చేతుల్లోకి తెచ్చుకోవడమే కాదు నేపాల్ దేశాన్ని మొత్తం చైనా సరిహద్దుల్లో కలుపుకునేందుకు చైనా ఎన్నో వ్యూహాలు కూడా అమలు చేస్తోంది


 ఇక ఇటీవలే చైనా నేపాల్ మధ్య ఓ వింత ఒప్పందం కుదిరింది. ప్రస్తుతం ఇది ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మామూలుగా ఇప్పటివరకు మిత్ర దేశాల మధ్య సైనిక స్థావరాలను పంచుకునే ఒప్పందాలు కుదరడం మనం చూశాం. అంటే ఏదైనా యుద్ధ సమయం వచ్చినప్పుడు ఇతర దేశాల సైనిక స్థావరాలను ఉపయోగించుకుని అక్కడినుంచి యుద్ధం చేసేందుకు ఒప్పందం జరుగుతూ ఉంటుంది.  ప్రస్తుతం చైనా నేపాల్ మధ్య కుదిరిన ఒప్పందం మాత్రం సైనిక స్థావరాలను కాదు ఏకంగా సైనికులనే  మార్చుకోవడానికి జరిగింది. కొంతమంది నేపాల్ సైనికులు చైనా సరిహద్దుల్లో పహారా కాస్తే.. చైనా సైనికులు వచ్చి నేపాల్ సరిహద్దుల్లో పహారా కాస్తూ ఉంటారు.


 ఇలాంటి ఒప్పందం ప్రస్తుతం చైనా నేపాల్ మధ్య కుదిరింది. ఇలా సైనికులను ఎక్స్చేంజ్ చేసుకోవడం అనేది ఇదే మొదటిసారి అని విశ్లేషకులు అంటున్నారు విశ్లేషకులు. ఈ ఒప్పందం వెనుక  చైనా బలమైన వ్యూహం ఉంది అని అంటున్నారు. నేపాల్ సైనికులు చైనా సరిహద్దుల్లో పహారా కాస్తే  వారిని కూడా చైనీయులుగా  మార్చేస్తారని... అంతేకాకుండా నేపాల్ సరిహద్దుల్లో పహారా కాస్తున్న చైనా సైనికులు నేపాల్ సైనికులను కూడా తమ వైపుకు తిప్పుకుంటారని  విశ్లేషకులు అంటున్నారు. తద్వారా నేపాల్ ను కూడా చైనా తమ దేశంలో కలుపుకునేందుకు ప్రయత్నాలు చేస్తోందని... ఇదే జరిగితే భారత్కు పెద్ద ప్రమాదం వుంది అని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: