హత్రాస్ కేసు.. మళ్ళీ ఆ లాయర్ చేతికే..?

praveen
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హత్రాస్ ప్రాంతంలో జరిగిన యువతిపై  అత్యాచారం హత్య ఘటన  దేశ వ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ ఘటనలో నిందితులకు ఉరిశిక్ష వేసి శిక్షించాలి అంటూ బాధితురాలి తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు ఎన్నో స్వచ్ఛంద సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీలు సైతం యూపీఏ సర్కారుపై విమర్శలు చేస్తూనే ఉన్నాయి. ఇలాంటి ఘటనలు జరిగిన తర్వాత కూడా నిందితులను శిక్షించకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తూ ఉంది అంటూ విమర్శలు గుప్పిస్తున్నాయి  ప్రతిపక్ష పార్టీలు.



 దీంతో హత్రాస్ ఘటన నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మొత్తం అట్టుడికిపోతోంది. కొన్ని ప్రాంతాలలో అయితే ఆందోళనకారులు ఉద్రిక్త పరిస్థితులు సృష్టిస్తున్నారు. వాహనాల పై పెట్రోల్ పోసి నిప్పంటించి దగ్ధం చేయడం లాంటి ఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి.  దీంతో రంగం లోకి దిగుతున్న పోలీసులు ఆందోళనకారులను అదుపు చేసే పనిలో పడ్డారు. అంతేకాకుండా పలు ప్రాంతాల్లో 144 సెక్షన్ కూడా విధిస్తున్నారు  పోలీసులు. ఇదిలా ఉంటే హత్రాస్ కేసును విచారించేందుకు మరోసారి ఆ మహిళ మూర్తి  ముందుకొచ్చారు. ఇప్పటికే ఒక అత్యాచారం హత్య కేసులో బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చేసిన ఆ న్యాయవాది మళ్లీ ముందుకు వచ్చారు.



ఆ  లాయర్ ఎవరో కాదు నిర్భయ కేసును ఎన్నో ఏళ్ల పాటు వాదించి చివరికి నిందితులకు ఉరిశిక్ష పడేలా చేసినా కుష్వాహా. నిర్భయ కేసులో నిందితులకు  శిక్ష పడేందుకు ఎన్నో సంవత్సరాల పాటు నిరీక్షణ గా కేసు వాదిస్తూ లాయర్ కుష్వాహా  చేసిన కృషి అంతా ఇంతా కాదు అన్న విషయం తెలిసిందే. ఇప్పుడు హత్రాస్ ఘటనలో మృతురాలి కుటుంబానికి న్యాయం జరిగే విధంగా.. కేసు వాదించేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం హత్రాస్ బాధితురాలి కుటుంబాన్ని కలిసేందుకు లాయర్ ప్రయత్నించారు... కానీ ఊహించని విధంగా ఆ లాయర్ ను పోలీసులు అడ్డుకున్నారు. అయితే వారి తరఫున వాదించి న్యాయం జరిగేలా చేయాలని బాధితురాలి కుటుంబ సభ్యులు తనను కోరారని.. కానీ అధికారులు మాత్రం ఎందుకు వారి కుటుంబ సభ్యులను కలిసేందుకు  అంగీకరించడం లేదు అంటూ ప్రశ్నించారు. బాధిత కుటుంబాన్ని కలవకుండా వెనుదిరిగే ప్రసక్తే లేదు అంటూ స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: