ఆ ఘటన మరువక ముందే.. మరో దారుణం.. బ్రతకాలని ఉంది అంటూనే కన్నుమూసింది..?

praveen
ఉత్తరప్రదేశ్ లో హత్రాస్ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం గా మారిపోయిన విషయం తెలిసిందే. ఓ యువతిపై కొంతమంది కామాంధులు దారుణంగా అత్యాచారం చేయడమే కాకుండా... పాశవికంగా హింసించి చివరికి ప్రాణాలు తీసిన ఘటన పై  ప్రస్తుతం దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. నిందితులకు ఉరిశిక్ష విధించాలి  అంటూ డిమాండ్ చేస్తున్నారూ. ఆందోళనల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. అయితే దేశాన్ని అట్టుడుకిస్తున్న  ఈ ఘటన గురించి మరువక ముందే మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. హత్రాస్ కి 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న బలరాంపూర్ లో.. దళిత యువతిపై దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డారు కొంతమంది దుండగులు.




 చివరికి ప్రాణం తీశారు. అత్యాచారం చేస్తున్న సమయంలో దారుణంగా హింసించి యువతిని కొట్టడంతో ఆస్పత్రికి తీసుకెళ్తున్న  క్రమంలోనే చివరికి ప్రాణాలు వదిలింది సదరు యువతి. ఇక పోస్టుమార్టం తర్వాత వచ్చిన రిపోర్టులు  చూసి వైద్యులు సైతం షాకయ్యారు. సదరు దళిత యువతిని దారుణంగా అత్యాచారం చేయడమే కాకుండా తీవ్రంగా హింసించి  కొట్టి తీవ్రంగా గాయపరిచారు అన్న విషయం వెల్లడైంది. ఈ ఘటన స్థానికంగా సంచలనం గా మారిపోయింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. ఇద్దరు నిందితుల్లో ఒకరు మైనర్ కావడం గమనార్హం.



 బుధవారం ఎప్పటిలాగే ఉద్యోగానికి బయలుదేరిన తమ కూతురి పై కన్నేసిన కొంత మంది కామాంధులు మార్గమధ్యంలో అపహరించి... తన కూతురికి డ్రగ్స్ ఇచ్చి స్పృహ కోల్పోయేలా చేశారని... తర్వాత దారుణంగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు అంటూ మృతురాలి తల్లి తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. సామూహిక అత్యాచారం చేయడంతో పాటు దారుణంగా తన కూతుర్ని గాయపరిచారని... కనీసం నిలబడలేని విధంగా తన కూతురిని కొట్టారు అంటూ తెలిపిన మృతురాలి తల్లి చివరికి ఓ ఆటోలో   ఆసుపత్రికి తరలిస్తుండగా తనకు చావాలని  లేదని బతికించమని కూతురు వేడుకుంది అంటూనే  కన్నుమూసింది అంటూ ఆ తల్లి బోరున విలపించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: